పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న నగర మేయర్
విశాఖ లోకల్ న్యూస్:
గూడు లేని నిరుపేదలకు సొంతింటి కల నెరవేరడమే జగనన్న లక్ష్యమని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి తెలిపారు. బుధవారం ఆమె మూడవ జోన్ 16 వ వార్డు లోని ఇల్లు లేని పేదలకు ఇళ్ల పట్టాలు వి ఎం ఆర్ డి ఎ చైర్ పర్సన్ అక్రమాని విజయనిర్మల, వార్డ్ కార్పొరేటర్ మొల్లి లక్ష్మి తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ ఆనాడు జగనన్న పాదయాత్ర లో ప్రజల కష్టాలను, బాధలను చూసి పేదవారికి తిండి నీడ కల్పించాలనే ఉద్దేశంతో అధికారంలోకి రాగానే నవరత్నాలను ప్రవేశపెట్టి అవి అమలు చేస్తున్నారని తెలిపారు. నేడు మన వార్డులో 1380 పట్టాలను పేదలకు అందించడం జరిగిందని, చట్టాల తీసుకున్న పేదలు తమకు జగనన్న దయవల్ల సొంత ఇంటి కల నెరవేరిందని ఆనందంతో జగనన్నను దీవించారని తెలిపారు. ఇంకా ఎవరైనా వార్డులో అర్హత ఉండి ఇల్లు లేని వారు ఉంటే వెంటనే సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ ఫాస్ట్ట్రక్చర్ డైరెక్టర్ మొల్లి అప్పారావు, మండల రెవెన్యూ సిబ్బంది, వార్డు సచివాలయ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

