గుడివాడ అమర్నాథ్ తో భేటీ అయిన కొలుసు మోహన్ యాదవ్

గుడివాడ అమర్నాథ్ తో భేటీ అయిన కొలుసు మోహన్ యాదవ్

విశాఖపట్నం:


రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు మరియు వాణిజ్యం, సమాచార సాంకేతిక శాఖామాత్యులు గుడివాడ అమర్నాథ్ ని విశాఖపట్నం లోని వారి నివాసంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు జగన్ అన్న చేయూత ట్రస్ట్ అధ్యక్షులు కొలుసు మోహన్ యాదవ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ముందుగా పూల బొకే, శాలువతో సత్కరించారు.ఈ నేపథ్యంలో తమిళనాడుకు సంబంధించిన *సెల్వాస్ గార్మెంట్స్ కంపెనీ* కి సంబంధించి పలు అంశాలపై చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమం లో జగన్ అన్న చేయూత ట్రస్ట్ కార్యదర్శి వేగూరు హేమంత్ , సెల్వాస్ గార్మెంట్స్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ ఇంచార్జి రంగ రాజు మరియు తదితరులు పాల్గొన్నారు.