లక్ష్మీ నరసింహ స్వామి చందనోత్సవమునకు ఏర్పాట్లు పూర్తి.

లక్ష్మీ నరసింహ స్వామి చందనోత్సవమునకు ఏర్పాట్లు పూర్తి.


విశాఖ లోకల్ న్యూస్ :సింహాచలం 


సింహాచలం లక్ష్మీ నరసింహ స్వామి చందనోత్సవం ఈనెల 3వ తేదీన దేవస్థాన అధికారులు పూర్తిచేశారు. భక్తులకు, వీఐపీలకు, ఇతర అధికారులకు దర్శనాలకు పూర్తి ఏర్పాట్లు చేశామని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సూర్య కళ తెలియజేశారు. ఇది ఎండాకాలం కాబట్టి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా షెడ్లు వేసి, క్యూ లైన్ లో కూడా మజ్జిగ వాటర్ ప్యాకెట్స్ మెడికల్ సంబంధించిన సిబ్బందిని అన్ని ఏర్పాట్లు చేశామని తెలియజేశారు. భక్తులు కూడా హిందూ సాంప్రదాయ ప్రకారం  దుస్తులు ధరించి రావాలని చెప్పారు. భక్తులు నాయకులు విఐపిలు అందరూ ఆలయ సిబ్బందికి సహాయ సహకారాలు అందించాలని ఈ చందనోత్సవం దిగ్విజయంగా జరిపించాలని  ఆమె తెలియజేశారు. కరోనా తర్వాత ఈ చందనోత్సవానికి రెండు లక్షల మంది పైగా  భక్తులు వచ్చే అవకాశం ఉంది. స్వచ్ఛంద సేవా సంస్థలు పోలీసు, రెవిన్యూ జివిఎంసి మెడికల్ సిబ్బంది, విలేకరులు  అందరి సహాయ సహకారాలు అందించి ఈ చందనోత్సవం కు  వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా తమ సేవలు కావాలని ఆమె తెలియజేశారు. టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ దేవస్థానం వారు చూపించిన  పార్కింగ్ ప్లేస్ లో పార్కింగ్ చేసుకోగలను. కొండపైకి అందరికీ ఉచిత బస్ సర్వీసులు ఏర్పాటు చేశారు. భక్తులు కూడా దేవస్థానం సిబ్బంది చెప్పిన ప్రకారం నడుచుకునీ ఆ లక్ష్మీ నరసింహ స్వామి చందనోత్సవం దిగ్విజయంగా జయప్రదం చేయవలసిందిగా ఈవో సూర్యకళ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో  ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.