రాష్ట్ర టిఎన్టియసి ఆధ్వర్యంలో జరిగిన మేడే బహిరంగ సభ విజయవంతం.


రాష్ట్ర టిఎన్టియసి ఆధ్వర్యంలో  జరిగిన మేడే బహిరంగ సభ విజయవంతం.

విశాఖ లోకల్ న్యూస్ :విశాఖపట్నం 

రాష్ట్ర టిఎన్టియసి ఆధ్వర్యంలో  జరిగిన మేడే బహిరంగ సభ విజయవంతం చేసిన విశాఖ జిల్లా టిఎన్టియసి నాయకులకు అభినందనలు విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం టిఎన్టియుసి అధికార ప్రతినిధి బలిరెడ్డి సత్యనారాయణ

           ఉక్కునగరం టిఎన్టియసి కార్యాలయం వద్ద జరిగిన సమావేశంలో బలిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ మేడే సందర్భంగా గా రాష్ట్ర టిఎన్టియసి ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన భారీ బహిరంగ సభకు విశాఖ పార్లమెంటు నియోజకవర్గం అధ్యక్షులు విల్లా రామ్ మోహన్ కుమార్ ఆధ్వర్యంలో సుమారు 400 మంది విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం మరియు శాసనసభ నియోజకవర్గం కమిటీలు, పలు పరిశ్రమల టిఎన్టియసి విభాగల నాయకులు విజయవాడ వచ్చినందుకు అభినందనలు తెలియజేస్తున్నాము. రాష్ట్ర టి ఎన్ టి యు సి అధ్యక్షులు గొట్టుముక్కల రఘు రామరాజు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ఆంధ్ర రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కె అచ్చం నాయుడు, కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు దేవినేని ఉమామహేశ్వరరావు, బొండా ఉమా ,గద్దె మోహన్ రావు, వర్ల రామయ్య ,26 జిల్లాల టి ఎన్ టి యుసి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో రావడం జరిగింది ఆ బహిరంగ సభలో వక్తలు మాట్లాడుతూ రాష్ట్రములో ముఖ్యమంత్రి, కార్మిక మంత్రి వైయస్సార్సీపి ప్రభుత్వం అధికారం వచ్చిన  నుండి మేడే ఉత్సవాలు శ్రమశక్తి అవార్డు లు విశ్వమ రించడం జరిగిందని. రాష్ట్ర కార్మికుల సంక్షేమానికి తూట్లు పొడిచారని అన్నారు, త్యాగాలు, పోరాటం చేసి సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటు పరం చేయరాదని దీనిపై తెలుగుదేశం పార్టీ  నిరంతర పోరాటం చేస్తామని తీర్మానించడం జరిగింది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేస్తే కొనే వ్యక్తి ఆదాని గ్రూప్ కి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ సీటు కేటాయించడం మన ఆంధ్రుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని అన్నారు.

     ఈ సమావేశంలో గాజువాక నియోజకవర్గం టిఎన్టియుసి   ప్రధాన కార్యదర్శి అరుగుల మణికుమార్, ఆర్గనైజింగ్ కార్యదర్శి కోడూరు సత్యనారాయణ పాల్గొన్నారు.