వైయస్సార్ సున్నా వడ్డీ కార్యక్రమం లో పాల్గొన్న మాజీ మంత్రి అవంతి

 వైయస్సార్ సున్నా వడ్డీ కార్యక్రమం లో పాల్గొన్న మాజీ మంత్రి అవంతి.

విశాఖ లోకల్ న్యూస్ :భీమిలి 


భీమిలి నియోజకవర్గం లో ఆనందపురం మండలంలో వెల్లంకిలో, పద్మనాభం మండలంలో ఐనాడ లో సోమవారం నాడు జగనన్న సున్నా వడ్డీ కార్యక్రమం లో భీమిలి నియోజకవర్గం శాసనసభ్యుడు ముత్తంశెట్టి శ్రీనివాసరావు పాల్గొనడం జరిగింది. కార్యక్రమం లో బాగంగా మహిళలకు సున్నా వడ్డీ చెక్కులు అవంతి చేతులు మీదుగా అందజేయడం జరిగింది. అనంతరం ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత ప్రభుత్వం మహిళలకు సున్నా వడ్డీ సంపూర్ణ రుణమాఫీ చేయలేదు జగన్ ప్రభుత్వం లో వైయస్సార్ పొదుపు సంఘాలకు వైసిపి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని మహిళలకు మూడో ఏడాది కూడా సున్నా వడ్డీ సంపూర్ణ రుణ మాఫీ చేసి నిరూపించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని, అంతేకాక మహిళలకు పదవుల్లో రిజర్వేషన్ కల్పించడం లో, ప్రతీ అక్క చెల్లెమ్మ చిరు వ్యాపారులు గా ఎదగాలని జగనన్న చేదోడు ఇలా ప్రతీ పథకం మహిళలు కోసం పెట్టి వారికి పెద్ద పీట వేసి మహిళా పక్షపాతి గా నిలిచారని, రాష్ట్రంలో మహిళలు అందరూ జగన్ వెంటే ఉన్నారనే విషయాన్ని జీర్ణించుకోలేని ప్రతిపక్షం వైయస్సార్ సిపి ప్రభుత్వం పై లేనిపోని ఆరోపణలు తో బురద జల్లుతుందని, ఎవరెన్ని విదాలుగా చెడు ప్రచారాలు చేసినా రాబోయేది వైసిపి ప్రభుత్వం అని, ఆయన పాలనలో జిల్లా అధ్యక్షులు గా పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తానని మాట్లాడారు.ఈ కార్యక్రమంలో రెండు మండలాల యంపిపి లు, జెడ్పిటిసి లు, వైస్ యంపిపి లు , సర్పంచ్ లు , యంపిటిసి లు , యంఆర్వోఓ లు , యంపిడివోలు , ప్రభుత్వ అధికారులు , ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.