కోరాడ నాగభూషణంకే మా మద్దతు: సస్పెన్షన్ ఎత్తివేయాలి.

 కోరాడ నాగభూషణంకే మా మద్దతు: సస్పెన్షన్ ఎత్తివేయాలి తేల్చి చెప్పిన నియోజకవర్గ నాయకులు.

విశాఖ లోకల్ న్యూస్: ఆనందపురం

 భీమిలి మాజీ ఏఎంసీ చైర్మన్ టిడిపి సీనియర్ నాయకులు  కోరాడ నాగభూషణరావును సస్పెండ్ చేయడంపై ఆ పార్టీ నాయకులు నుండి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కష్టకాలంలో పార్టీని బలోపేతం చేస్తూ  గత 14 సంవత్సరాలుగా విశేషమైన సేవలందించిన కోరాడ నాగభూషణరావు పై సస్పెన్షన్ వేటు వేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. శక్తివంచన లేకుండా పార్టీనే నమ్ముకుని లక్షలాది రూపాయలు వ్యయం చేస్తూ అందరినీ అక్కున చేర్చుకునే వ్యక్తిని పార్టీ అధిష్టానం ఎందుకు గుర్తించలేదని నియోజకవర్గ నాయకులు ప్రశ్నించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చం నాయుడు తో బాహాటంగా  మాట్లాడి తేల్చి చెప్పారు. సస్పెన్షన్ను  రద్దు చేయకపోతే తమ పదవులకు కూడా రాజీనామా చేస్తామని ఘంటాపథంగా అన్నారు.

కోరాడ నాగభూషణరావు పార్టీ విధేయుడని అన్నారు.  పార్టీ పరంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన ఘనత ఆయనదని, సస్పెండ్ వ్యవహారం ఏదో పొరపాటు అయి ఉంటుంది దానిని జాతీయ క్రమశిక్షణ సంఘం దృష్టికి తీసుకొని వెళ్లి పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని పల్లా శ్రీనివాసరావు  రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకొని వెళ్లారు.  ఈ విషయమై  సానుకూలంగా స్పందించిన అచ్చెన్నాయుడు పార్టీకి అందరూ అవసరమని,  ఇది ఏ ఒక్కరి సొత్తు కాదని అన్నారు.  ఇంతమంది సీనియర్ నాయకులు ఇక్కడకు వచ్చి మాట్లాడారు అంటే సమస్యను నేను అర్ధం చేసుకుంటానని,  దీనికోసం  ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని అన్నారు.  కోరాడ నాగభూషణరావు సేవలు పార్టీకి అవసరమని ఈ విషయం   జాతీయ క్రమ శిక్షణ సంఘం చైర్మన్ దృష్టికి, పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు దృష్టికి  తీసుకొని వెళతానని అన్నారు.  తెలుగుదేశం పార్టీ  క్రమ శిక్షణ గల పార్టీ అని చెప్పారు.  చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయని  తెలుగుదేశం పార్టీ విజయమే లక్ష్యంగా అందరం కలసి పనిచేద్దామని అన్నారు.    ఈనెల 5వ తారీకున భీమిలి మండలం తాళ్లవలసలో  బాదుడే బాదుడు కార్యక్రమం  మన ప్రియతమ  నాయకులు నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో జరుగుతుందని అందరూ కలసి విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు అచ్చెన్నాయుడు  సూచించారు.

ఈ  కార్యక్రమంలో  మాజీ శాసన సభ్యులు కర్రి సీతారాం, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి,  గంటా నూకరాజు,  జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి పాసర్ల ప్రసాద్,  సీనియర్ నాయకులు  గాడు అప్పలనాయుడు,  బమ్మిడి సూర్యనారాయణ, దాసరి శ్రీనివాసరావు, పిల్లా వెంకటరావు,  మొల్లి  లక్ష్మణరావు,  యర్రా రాము, వాండ్రాసి అప్పలరాజు, బోణి సత్య వరప్రసాద్ సర్పంచ్ లు, ఎంపిటిసిలు, మాజీ జెడ్పిటిసి లు  తదితరులు పాల్గొన్నారు.