ఇఫ్తార్ విందులో పాల్గొన్న 5వ వార్డ్ కార్పొరేటర్ మొల్లిహేమలత.
విశాఖ లోకల్ న్యూస్ :మధురవాడ
మధురవాడ: జీవీఎంసీ 5వ వార్డు పరిధి మధురవాడ దరి మారికవలస రాజీవ్ గృహకల్ప లో గల మజీద్-ఎ-ఉమర్ బిన్ ఖత్తాబ్ మసీదులో ఆదివారం రాత్రి నిర్వహించిన ఇఫ్తార్ విందులో 5వ వార్డ్ కార్పొరేటర్ మొల్లిహేమలత,రమణ.టిడిపి రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి మొల్లిలక్ష్మణరావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ మొల్లి హేమలత "పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు,ప్రార్థనల్లో ముస్లిం సోదరులతో కలిసిపాల్గొనడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.ముస్లిం సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు.వారు చేస్తున్న కఠోర ఉపవాస దీక్షను కొనియాడారు. రంజాన్ మాస విశిష్టతను వివరించారు,మనకు ఉన్న దానిలో పేదలకు కొంత దానాన్ని ఇమ్మని ఖురాన్ బోధిస్తోంది అని,సర్వ మత సమానంగా జీవించాలని, ప్రజలందరూ సన్మార్గంలో నడవాలని ఖురాన్ చెబుతోందని వాటిని అందరూ ఆచరించాలని పిలుపునిచ్చారు.సర్వ మత సామరస్యానికి భారతదేశం ప్రతీకగా నిలుస్తోందని అన్నారు.ఈకార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఈగల రవి, నియోజక వర్గ బీసీ సెల్ అధ్యక్షులు నమ్మి శ్రీను, నాగేశ్వరరావు, మజీద్ అధ్యక్షులు ఇంత్యాజ్ ఖాన్,ఉపాధ్యక్షులు ఎం.కె మొహిద్దీన్,కార్యదర్శి మొహిద్దీన్ షరీఫ్,ఎం.డి.నజీర్, ఇమ్రాన్:రమీజ్ ఖాన్,చక్రపాణి, భాస్కర్,శేఖర్, అవ్వ కృష్ణ,మరియు అనేకమంది ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.




