విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ని కలిసిన మైనారిటీ సెల్ సభ్యులు.
విశాఖ లోకల్ న్యూస్ :విశాఖపట్నం.
మాజీ మంత్రివర్యులు విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ని రాష్ట్ర తెలుగు దేశం పార్టీ మైనారిటీ సెల్ కు ఎన్నికైన సందర్భంగా కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. మరియు శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు కి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడు గా ఎన్నికైన, షేక్ చిన రెహమాన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ లు జపీరుల్లా, షేక్ బాబ్జీ, సెక్రటరీ లు అబ్దుల్ హసీఫ్, మహమ్మద్ సలీం లు కమిటీ సభ్యులు కలిసారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ ఇన్చార్జి విజయ్ బాబు జిల్లా పార్లమెంటరీ పార్టీ ఉపాధ్యక్షుడు పైలా ముత్యాల నాయుడు, ఐటిడిపి నరేష్, 45వ వార్డు ప్రెసిడెంట్ భరణికాన రాజు, వాసుపల్లి రాజు, జిల్లా మహిళా పార్లమెంటరీ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ గొలగాని సౌజన్య, మరియు ఇతర నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.

