అముజూరి శ్రీనువాసరావు కుటుంబానికి అండగా గణేష్ యూత్ సభ్యులు

 అముజూరి శ్రీనువాసరావు కుటుంబానికి అండగా గణేష్ యూత్ సభ్యులు.

విశాఖ లోకల్ న్యూస్ :భీమిలి

భీమునిపట్నం మండలం, మజ్జివలస గ్రామానికి చెందిన కుటుంబ పెద్ద దిక్కు అయినా అముజూరి శ్రీనువాసరావు గత సంవత్సరం కరోనా టైం లో అనారోగ్యం కారణంగా హఠాత్తుగా మరణించారు. కుటుంబానికి పెద్ద దిక్కు పోయిన ఆ కుటుంబానికి ఆయన ప్రదమ వర్దంతిని పురస్కరించుకొని మజ్జివలస బి సి కోలనీ కి చెందిన గణేష్ యూత్ సభ్యులు అందరూ దీనిలో భాగస్వాములై ఆ కుటుంబానికి సుమారు 17000 రూపాయలు ఆర్దిక సహాయం తో పాటు నిత్యావసర వస్తువులు అందజేసారు. వీల్ల సేవా దృక్పదానికి మెచ్చి గ్రామస్తులు గణేష్ యూత్ సభ్యులు ని అభినందంచారు.