జగన్ అన్న చేయూత ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకు ఆర్ధిక సాయం.

 జగన్ అన్న చేయూత ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకు ఆర్ధిక సాయం.

విశాఖ లోకల్ న్యూస్ :విజయవాడ ప్రతినిధి

కృష్ణాజిల్లా గన్నవరం మండలం కి చెందిన కె.నాగతేజ అనే విద్యార్థి బుద్ధవరం వి.కె.ఆర్ కళాశాలలో బై.పి.సి గ్రూప్ చదువుతున్నాడు. పేదరికం కారణంగా ఉన్నత చదువులు చదవాలని ఉన్నా చదవలెని పరిస్థితి ఈ క్రమంలో జగన్ అన్న చేయూత ట్రస్ట్ అధ్యక్షులు కొలుసు మోహన్ యాదవ్ ఆ విద్యార్ధిని గుర్తించి ట్రస్ట్ తరుపున చదివిస్తున్నారు.ఈ క్రమంలో నేడు విజయవాడలోని జగన్ అన్న చేయూత ట్రస్ట్ ప్రాంతీయ కార్యాలయంలో విద్యార్ధికి పరిక్షల రుసుము నిమిత్తం 8000 రూపాయల చెక్కను విద్యార్ధికి అందచేశారు.ఈ కార్యక్రమంలో జగన్ అన్న చేయూత ట్రస్ట్ కార్యదర్శి వేగూరు హేమంత్ మరియు ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.