మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొనే బాదుడే బాధుడు కార్యక్రమం ను జయప్రదం చెయ్యండి.
విశాఖ లోకల్ న్యూస్ :భీమిలి
గురువారం సాయంత్రం 5 గం.లకు భీమునిపట్నం మండలం తాళ్లవలస గ్రామంలో "బాదుడే బాదుడు" కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మన ప్రియతమ నేత నారా చంద్రబాబునాయుడు విచ్చేయుచున్నారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకై జీవీఎంసీ 2వ వార్డు కార్పొరేటర్ మరియు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గాడు చిన్నికుమారిలక్ష్మి, తెలుగుదేశం సీనియర్ నాయకులు గాడు అప్పలనాయుడు 2వ వార్డులోని రాజలింగంపేట, చిల్లపేట, రాయపాలెం, డెక్కతిపాలెం, మామిడిపాలెం, నమ్మివానిపేట, వలందపేట, సంగివలస, సంతపేట, కుమ్మరివీధి, పలు ప్రాంతాల్లో పర్యటించి పార్టీ నాయకులు, కార్యకర్తలను మరియు ప్రజలను చైతన్యపరిచి తాళ్లవలసలో జరిగే "బాదుడే బాదుడు" కార్యక్రమానికి అందరూ స్వచ్చందంగా వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రజలను కోరుతున్నారు.

