చిప్పాడ సచివాలయంలో బాల్య వివాహాలు నియంత్రణ పై అవగాహన సదస్సు.
విశాఖ లోకల్ న్యూస్ :మధురవాడ
చిప్పాడ పంచాయితీ సచివాలయంలో బాల్య వివాహాలు నియంత్రణ పై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ను ఉద్దేశించి ముఖ్య అతిథులు మాట్లాడుతూ నేటి నవ నూతన సమాజంలో మారు మూల గ్రామాల్లో బాల్య వివాహాలు చేస్తున్నారని దీనికి కారణం అవగాహన లేకపోవడం , నిరక్షరాస్యత వీటిని రూపుమాపాలంటే ఇలాంటి సదస్సు లు నిర్వహించాలని 18 సం నిండిన తరువాత ఆడపిల్ల లకు వివాహాలు జరిపించాలని , అలా కాకుండా చిన్న వయసులో వివాహం చేసినట్లయితే ఆడపిల్లల్లో శారీరికంగానూ మానసికంగానూ అభివృద్ది అనేది జరగకపోగా , చిన్న వయసులో గర్భం దాల్చినచో గర్భస్రావం, రక్తస్రావం, రక్తహీనత ఇలా పలు రకాలైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని , ఒక్కోసారి ప్రాణాపాయం కూడా సంభవించవచ్చు అని కనుక బాల్య వివాహాలు కు దూరంగా ఉండండి అవి చేసేడి వారు మీ ప్రాంతంలో ఉంటే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం చేరవేయాలని మాట్లాడటం జరిగింది... ఈ కార్యక్రమంలో పంచాయితీ సర్పంచ్ సూరిబాబు, ఉప సర్పంచ్ సరగడ రాజారెడ్డి, యంపిటిసి, వార్డు మెంబర్ లు , గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది. ఈ సదస్సు ను సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, మమేకమై నిర్వహించడం జరిగింది.. మహిళా పోలీస్ గా ప్రప్రథమంగా పంచాయితీ అంతా వాడ వాడలా తిరిగి సదస్సు పై ప్రజలకు అవగాహన కల్పించి కార్యక్రమం కి వచ్చేలా చెందిన మహిళా పోలీస్ సులోచన ను ప్రజలు నాయకులు కొనియాడారు ....

