వ్యాక్సిన్ తీసుకోవాలని ఒత్తిడి చేయకండి: సుప్రీం కోర్టు.
విశాఖ లోకల్ న్యూస్ :న్యూఢిల్లీ:
దేశంలో కరోనా కట్టడి కోసం వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటికి 1,89,23,98,347 మందికి వ్యాక్సిన్లను ఇచ్చినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తాజా బులిటెన్‌లో పేర్కొంది.
ఇదిలా ఉండగా దేశంలో వ్యాక్సిన్‌లను తప్పనిసరి చేయడంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన ధర్మాసనం కీలక వ్యాఖ‍్యలు చేసింది. కోవిడ్ టీకా వేసుకోవాలని ప్రజలపై ఒత్తిడి చేయవద్దు అని కోర్టు పేర్కొన్నది. ప్రస్తుత వ్యాక్సినేషన్ విధానం ఏకపక్షంగా ఉందని కూడా చెప్పలేమని స్పష్టం చేసింది. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కలిగే దుష్ఫరిణామాల గురించి కేంద్రం డేటాను విడుదల చేయాలనలి ఆదేశించింది.
అలాగే, వ్యాకినేషన్ చేసుకోకపోతే వారిని పబ్లిక్ ప్రదేశాలకు రానివ్వకపోవడం కరెక్ట్ కాదని పేర్కొంది. ఈ క‍్రమంలో కొన్ని రాష్ట్రాలు తీసుకున్న ఈ నిర్ణయాన్ని, ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని వెల్లడించింది. అనంతరం వ్యాక్సిన్ విషయంలో ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం ఓ విధానాన్ని రూపొందించి అమలు చేయాలని స్పష్టం చేసింది.

