తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై.వి. సుబ్బా రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి అవంతి.
క్యాపిటల్ వాయిస్ :హైదరాబాద్
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్,విశాఖ పట్నం,అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ వై.వి. సుబ్బా రెడ్డి జన్మదిన సందర్భంగా మాజీ మంత్రి వర్యులు,విశాఖ పట్నం జిల్లా అధ్యక్షులు,భీమిలి శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాస్ (అవంతి) హైదరాబాద్ ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అవంతి శ్రీనివాస్ తో పాటు కుమారుడు ముత్తంశెట్టి శివ నంధిష్ కూడా పాల్గొన్నారు.

