తారా మసీదులో షాయరి ధావత్.
విశాఖ లోకల్ న్యూస్ :విశాఖపట్నం.
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ రోజు 22 వ వార్డులో మంగాపురం కాలనీలో ఉన్న తారా మసీదులో షాయరి ధావత్ ని ముస్లిం సోదరీమణులు , సోదరులు కు అందజేసిన స్థానిక జనసేన కార్పొరేటర్ *పీతల మూర్తి యాదవ్* . తారా యూత్ ఆద్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధి గా పాల్గొన్న మూర్తి యాదవ్ మాట్లాడుతూ ముస్లిం సోదరులు పవిత్రంగా జరుపుకొనే రంజాన్( ఈద్ ముబారక్ ) ఉపవాస దీక్షలో పాల్గొనటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు . ఈ కార్యక్రమంలో మసీదు ప్రెసిడెంట్ రజాక్ , మరియు మసీదు జమాత్ సభ్యులు , తదితరులు పాల్గొన్నారు .

