వాంబేకాలనీ యూ పి హెచ్ సి ఆధ్వర్యంలో మలేరియా, డెంగీ దోమల నివారనపై ప్రజలకు అవగాహన ర్యాలీ
మధురవాడ : వి న్యూస్ ప్రతినిధి : అక్టోబర్ 18:
మధురవాడ వాంబేకాలనీలో మలేరియా, డెంగీ దోమల నివారనపై ప్రజలకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. డి ఎం ఓ సూపెర్వైసర్ రామునాయుడు, వాంబే కాలనీ యూ పి హెచ్ సి వైద్యాధికారి సుస్మిత ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం జోన్2 మలేరియా ఇన్స్పెక్టర్ మంగరాజును వార్డులో ప్రజలు మలేరియా, డెంగీ బారిన పడకుండా ఉండేవిధంగా దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని 7వవార్డ్ కార్పొరేటర్, జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబెర్ పిళ్ళా మంగమ్మ అధికారులను కోరటంతో జోన్2 మలేరియా ఇన్స్పెక్టర్ మంగరాజు ఆదేశాలతో 7వ వార్డ్ మలేరియా సూపెర్వైసర్ సత్యనారాయణకు మలేరియా డెంగీ నివారణ సిబ్బందికి ఆదేశాలు జారీ చెయ్యటంతో 7వవార్డ్ సూపెర్వైసర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో శుక్రవారం మధురవాడ వాంబేకాలనీలో మలేరియా డెంగీ దోమలు ఏవిధంగా వృద్ధి చెందుతాయో నివారణపై వేపాకుల పొగ, దోమలకు సెగ, డ్రైడే ఫ్రైడే అంటూ పరిసర ప్రాంతాలలో ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీ అనంతరం డి ఎం ఓ రామునాయుడు మాట్లాడుతూ నీరు నిల్వ లేకుండా, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచటంతోనే దోమలను నివారించవచ్చని దోమలు ఎందువలన ఏ విధంగా వృద్ధి చెందుతాయో చూపిస్తూ ప్రజలకు వివరించారు. దోమలను నివారించటం వలన తద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని అవగాహన కల్పించారు. వైద్యాధికారి సుష్మిత మాట్లాడుతూ ఇంట్లో నిరూపయోగంగా ఉన్న, ఉపయోగంలో ఉన్న బాటిల్, టైర్లు, మొక్కల కుండీలలో ఫ్రిడ్జ్ వెనుక, కొన్ని వస్తువులలో నీరు నిల్వ ఉండటంతో లార్వా తయారయ్యి మలేరియా, డెంగీ దోమలు వృద్ధి చెందుతాయని కావున ప్రజలు వీటిని గుర్తించి నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, అలాగే ప్రతీ శుక్రవారం ట్యాంకులు, డ్రమ్ములను శుభ్రపరిచి డ్రై డే ఫ్రైడే గా చూసుకోవాలని తగు సూచనలు చేసారు. ఈ కార్యక్రమంలో సూపెర్వైసర్ సత్యనారాయణ, ఏ ఎన్ ఎమ్ లు, ఆశా వర్కర్లు, సచివాలయం శానిటేషన్ సిబ్బంది, మలేరియా సిబ్బంది లక్ష్మి, భవాని, దుర్గ, సంతోషి, బాలకృష్ణ, జగదీశ్,కుమారి, తదితర సిబ్బంది పాల్గొన్నారు.

