వికలాంగుల కాలనీలో మద్యం దుకాణంకు అనుమతి ఇవ్వవద్దు అంటూ నిరసన తెలిపుతున్న గ్రామస్తులు.
మధురవాడ: వి న్యూస్ ప్రతినిధి : అక్టోబర్ 14:
వికలాంగుల కాలనీ శ్రీ వెంకటేశ్వర రెసిడెంట్సిషల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మద్యం దుకాణం వద్దు అంటూ గ్రామస్తులు నిరసన తెలిపారు. వికలాంగుల కాలనీ గ్రామంలో నివసిస్తున్న ఏ ఆర్ కానిస్టేబుల్ లాలం సన్యాసి నాయుడు తన ఇంటిని మద్యం దుకాణంకి ఇస్తున్నారని సమాచారంతో గ్రామస్తులు అందరు సమావేశం నిర్వహించారు. అనంతరం అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ మద్యం దుకాణం విషయమై గ్రామస్తులు అందరు కలిసి లాలం సన్యాసి నాయుడుని
మర్యాద పూర్వకంగా కలిసి మీ ఇంటిని మద్యం దుకాణంకి ఇవ్వవద్దు అని సూచించారు.
ఈ గ్రామంలో పిల్లలు పాఠశాలకు వెళ్లే పిల్లలు , కాలేజీలకి వెళ్లే విద్యార్థులు, ఉద్యగాలకి వెళ్ళేవారు
మరియు నిత్యం దేవాలయంకి వెళ్లే ఆడవారుకి ఇబ్బందిగా ఉంటుంది. మద్యం తాగి మత్తులో ప్రజలను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి మద్యం దుకాణంకు ఇవ్వ వద్దు అని విజ్ఞప్తి చేసారు. ఏ ఆర్ కాన్స్టేబుల్ సన్యాసి నాయుడు
మరియు వారి కుంటుబ సభ్యులు నా ఇల్లు నా ఇష్టం
నేను ఏమైన చేసుకుంటాను ఏ దుకాణం కైనా ఇచ్చుకుంటాను మీరు ఏమి చేసుకుంటారో చేసుకోండి అంటూ దౌర్జన్యంగా మాట్లాడారు అని తెలిపారు.
అనంతరం గ్రామ ప్రజలందరు వైన్ షాప్ వద్దు ఆదివారం అని ముక్త కంఠంతో నినాదాలు చేస్తూ నిరసన తెలిపాము. కావున ఉన్నత అధికారులు గ్రామ ప్రజలను గమనించి మద్యం దుకాణంనకు అనుమతులు మంజూరు చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు.

