*7వవార్డులో సమస్యలపై జివియంసి కమిషనర్ పి. సంపత్ కి వార్డు కార్పొరేటర్ మరియు స్టాండింగ్ కమిటీ మెంబర్ పిళ్ళా మంగమ్మ వినతి పత్రం అందజేశారు* .
మధురవాడ: వి న్యూస్ ప్రతినిధి : అక్టోబర్ 04: చంద్రoపాలెం వాంబేకొలని నగరంపాలెం మల్లయ్యపాలెం గ్రామాలలో స్మశాన వాటిక అభివృద్ధి పనులు చెప్పట్టాలి అన్నారు. 7వ వార్డులో పబ్లిక్ హెల్త్ వర్కర్స్ నీ పెంచాలని కోరారు. వాంబై కొలని ఎన్జిఓస్ లే అవుట్ మల్లయ్యాపాలెం ఆర్టీసీ కోలని మొగదరమ్మ కొలనీలలో రోడ్లు కలువలు మరమత్తులు మరియు కొత్తవి వేయాలని కోరారు.మల్లయ్యపాలేంలో పార్క్ అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు. ఎస్ఎఫ్సి హోటల్ నుంచి మధురవాడ ఏపీఈపిడిసిఎల్ కార్యాలయం వరకు సర్వీస్ రోడ్డు లో డ్రెయిన్ క్లీనింగ్ చేయించి చెత్తను తొలగించమని కోరారు
ఈ సమస్యలను పరిశీలించి త్వరలోనే తగిన చర్యలు తీసుకుని పనులు జరిపిస్తామని జి వి యం సి కమిషనర్ పి సంపత్ తెలియజేశారు.
