ముగ్గులు వేసి నిరసన తెలిపిన భూములు నష్టపోయిన రైతులు.

ముగ్గులు వేసి నిరసన తెలిపిన భూములు నష్టపోయిన రైతులు.

కొమ్మాది : వి న్యూస్ ప్రతినిధి : జూలై 27: 

రైతులకు న్యాయం చేసే వరకు ఈ పోరాటం ఆగదని ఎం ఆర్ పి ఎస్ నాయకులు మోర్త రమణ తెలియ జేశారు.శనివారం బక్కన్న పాలెం హుధూద్ గృహాల వద్ద రైతుల కుటుంబాలు ముగ్గులు వేసి,మాకు ఇస్తామని హామీ ఇచ్చిన ఇల్లు ఇవ్వాలని నినాదాలు చేస్తూ,వినూత్నంగా  నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ కార్యక్రమంలో మోర్త రమణ పాల్గొని రైతులకు న్యాయం జరిగే వరకూ అండగా ఉంటామని తెలియజేశారు.

రైతుల నుండి తీసుకున్న భూముల్లో నిర్మించిన ఇల్లు తప్పుడు దారిలో కేటాయించారని ఆరోపించారు. ఉత్తర  ఇయోజకవర్గంలో ఉన్నవారికి ఈ గృహాలు కేటాయింపులో అవినీతి జరిగిందని అనేక మంది ఆరోపిస్తున్నారని అన్నారు.

ఈ గృహాలు కేటాయింపులో వస్తున్న ఆరోపణలపై సమగ్రమైన విచారణ చెయ్యాలని డిమాండ్ చేశారు.అంత వరకు గృహాలు కేటాయింపును నిలుపు దల చేయాలని కోరారు.భూములు కోల్పోయి, నష్టపోయిన రైతులకు అధికారులు, ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీ మేరకు ఇల్లు వెంటనే ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో బంక పోతురాజు, కే నాగరాజు, ఎస్ పైడితల్లి,కే స్వాతి,ఎస్ సోమమ్మ,జీ కొండమ్మ, కే కేశవరావు, ఎస్ కొండమ్మ సిపిఎం నాయకులు డి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.