రైతులకు ఇల్లు ఇచ్చే వరకు పోరాటం ఆగదు: భూములు కోల్పోయి నష్టపోయిన రైతులు

రైతులకు ఇల్లు ఇచ్చే వరకు పోరాటం ఆగదు: భూములు కోల్పోయి నష్టపోయిన రైతులు

మధురవాడ : వి న్యూస్ :  జూలై 26: 

బక్కన్న పాలెం సినీ పరిశ్రమ హుధూదు ఇళ్ల వద్ద 8 వరోజు రైతుల నిరసన  శిబిరం కొనసాగిందని,న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని కే వి పి ఎస్ నాయకులు సియాద్రి పైడితల్లి,రైతు సంఘం నాయకులు బి పోతూరాజు.తెలియ జేశారు.శుక్రవారం దీక్షా శిబిరం వద్ద పెద్ద పెట్టున నినాదాలు చేశారు.ఈ సందర్భంగా ఎంట్లాడుతూ ఇన్ని రోజులుగా వర్షం కురుస్తున్న తడుస్తూ ఇక్కడ నిరసన చేస్తున్న, ఏ పి ఎస్ హౌసింగ్ కార్పొరేషన్ అధికారులకు చలనం లేకుండా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.నిర్మాణాలకోసం ఏటువంటి నష్టపరిహారం లేకుండా భూములు కోల్పోయిన రైతులంటే అంత చులకనగా ఉందని అన్నారు. హౌసింగ్ అధికారులు ఇక్కడకు వచీ ఇల్లు ఇచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలియ జేశారు.ఈ కార్యక్రమంలో కే నాగరాజు,ఎస్  దేవుడు,భవాని శంకర్ అక్కమ్మ,కే గౌరమ్మ,గణేష్,యు అరుణ,తదితరులు పాల్గొన్నారు