ప్రజలు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవగాహన కల్పించాలి: కార్పొరేటర్ మొల్లిహేమలత.
5వ వార్డ్ శివశక్తినగర్ రోడ్ లో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం.
మధురవాడ: వి న్యూస్ : జూలై 26:
మధురవాడ: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా శానిటరీ సిబ్బంది,సచివాలయ కార్యదర్శులు ప్రజలకు అవగాహన కల్పిస్తూ చైతన్య పరచాలని జీవీఎంసీ 5వ వార్డ్ కార్పొరేటర్ మొల్లిహేమలత సూచించారు.ఫ్రైడే-డ్రైడే కార్యక్రమంలో భాగంగా 5వ వార్డు శివశక్తినగర్ రోడ్డులో 68,69,70 సచివాలయాల పరిధిలో జీవీఎంసీ జోన్-2 కమిషనర్ శైలజవల్లి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈసందర్భంగా 5వవార్డ్ కార్పొరేటర్ మొల్లిహేమలత మాట్లాడుతూ..పరిసరాల పరిశుభ్రతపట్ల నిర్లక్ష్యo వ్యవహరించడమే అన్నింటికీ కారణమవుతుందిఅన్నారు.
ప్రతీ ఒక్కరూ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వలన ఎలాoటిరోగాలు దరిచేరవని తెలిపారు.నీటి నిల్వలతోనే దోమలువృద్ధి చెందుతాయని వీటి నివారణకు ప్రతిఒక్కరు చర్యలు తీసుకోవాలని సూచించారు.వారంలో ప్రతి శుక్రవారం డ్రైడే పాటించేలా చూడాలని,డెంగ్యూ,మలేరియ కేసులునమోదుఅవ్వకుండా చూడాల్సిన బాధ్యత మలేరియా సిబ్బందిపై ఉందని తెలిపారు.జోనల్ కమిషనర్ శైలజవల్లి మాట్లాడుతూ.. పారిశుధ్య సిబ్బంది 8గంటలు పనిచేయాలని,కచ్చితంగా రోడ్లుకాలువలు శుభ్రం పరచాలని ప్రతిఇంటి నుండి తడి చెత్త,పొడిచెత్త ప్రమాదకరమైనచెత్తను సేకరించాలని,కమర్షియల్ ఏరియాల్లో కూడాచెత్త సేకరణ జరగాలని శానిటరీ ఇన్స్పెక్టర్, సచివాలయ సిబ్బందికి ఆదేశించారు.కార్యక్రమంలో జీవీఎంసీ జోన్-2 జోనల్ కమిషనర్ శైలజ వల్లి,ఏ.ఎం.హెచ్.ఓ కిషోర్, శానటరీ ఇన్స్పెక్టర్లు మంగరాజు , కాకర శ్రీనివాసరావు, వార్డ్ ప్రధాన కార్యదర్శి ఈగల రవికుమార్, వియ్యపు నాయుడు,మహిళా నాయకురాలు సరస్వతి,బిర్లంగి నారాయణరావు,అన్నెపు రమణమూర్తి,యు.సి.డి.విభాగం సి ఓ ఆదినారాయణ రెడ్డి,డ్వాక్రా మహిళలు స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

