కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీ. పౌరులందరు ఎదిరించాలి. సీఐటీయూ జోన్ ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్

కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి  ద్రోహం చేసిన బీజేపీ. పౌరులందరు ఎదిరించాలి. సీఐటీయూ జోన్ ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ 

మధురవాడ :వి న్యూస్  : జూలై 26: 

రాష్ట్రానికి పది సంవత్సరాలుగా ద్రోహం చేస్తున్న బీజేపీ ప్రభుత్వం దాని వంచన విధానాలు కొనసాగించిందని సిపిఎం,సి ఐ టీ యు మధురవాడ జోన్ కమిటీలు ఆవేదన వ్యక్తం చేశాయి.2024,2025 సంవత్సరానికి ఈ నెల 23 న లోకసభలో ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్ లో  మన రాష్ట్రం పట్ల వివక్షతను కొనసాగించారని సిపిఎం జోన్ కార్యదర్శి డి అప్పలరాజు అన్నారు.కేంద్ర బడ్జెట్ లో మన రాష్ట్రానికి బీజేపీ చేసిన అన్యాయంపై శుక్రవారం జీ వి ఎం సి 7వ వార్డు పరిధిలో మధురవాడ మార్కెట్ కూడలి వద్ద నిరసన కార్యక్రమం సీటు,సిపిఎం నాయకులు చేపట్టారు.ఈ సందర్భంగా ప్ల కార్డులు ప్రదర్శింఛీ,నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో అప్పలరాజు మాట్లాడుతూ రాజధానికి వివిధ ఆర్థిక సంస్థల,ప్రపంచ బ్యాంక్ ద్వారా 15 వేల కోట్లు సర్దుబాటు చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారని తెలిపారు.అంటే కేంద్రం నుండి మన రాష్ట్రానికి ఇచ్చింది ఏమిటని ప్రశ్నించారు.

విభజన చట్టంలోనివి అమలుచేయవలసిన పనులకు,ఈ బడ్జెట్ లో దేనికి ఎంత ఇస్తున్నారన్నది ఒక్కటి కూడా చెప్పలేదని అన్నారు.

అన్నీ చేస్తాం చేస్తాం అని తప్ప స్పష్టంగా కేటాయింపులు లేవు అని అన్నారు.మన విశాఖ జిల్లా లో రైల్వే జోన్,మెట్రో రైలు,విశాఖ ఉక్కు పరిశ్రమకు బడ్జెట్ లో కేటాయింపులు చేయకుండా తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.మన రాష్ట్రం లో ఉన్న ఎన్డీఏ కూటమి,వైఎస్ఆర్సీపీ పార్టీలు కనీసం స్పందించడం లేదని అన్నారు.మన రాష్ట్రం లో బీజేపీ ఎంపీలు అబద్ధాలు ప్రచారం చేస్తూ రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేస్తున్నారని తెలియ జేశారు.అనకు అన్యాయం చేస్తున్న బీజేపీ విధానాలపై ప్రజలు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీటు జొన్ ప్రధాన కార్యదర్శి పి రాజ్ కుమార్,కార్యకర్తలు జీ చిన్నారావు,వి గోవిందా,జగదీష్,సిపిఎం కార్యకర్తలు ఏ జీ రెడ్డి,కే సు జాత,డి తులసి,దివ్య తదితరులు పాల్గొన్నారు.