స్ప్రింగ్ ఫీల్డ్ పాఠశాలలో క్రిస్తు మత బోధనలు చేస్తున్నారని జిల్లా విద్యాశాఖ అధికారినికి పిర్యాదు చేసిన ఏబివిపి సభ్యులు.
పద్మనాభం : వి న్యూస్ : జూలై 26:
పద్మనాభం మండలం కృష్ణాపురం పంచాయితిలో గల స్ప్రింగ్ ఫీల్డ్ పాఠశాలలో క్రిష్టియన్ మతంకి సంబందించి నిత్యం విధ్యార్థులకి వందేమాతరంకి ముందు క్రిష్టియన్ ప్రార్థన సూక్తులు, చెప్పించి అప్పుడు వందేమాతరం చెపిస్తూ, విద్యార్ధికి తెలుగు సబ్జెక్ట్ ఎలాగో అలాగే క్రిష్టియన్ మతంకి సంబందించిన పుస్తకం ప్రతీ విద్యార్ధికి 250 చప్పున కొనిపించి వారితో నిత్యం అభ్యసిస్తూ వారిని బొట్టు, గాజులు తిపించి వారి యొక్క మతాన్ని అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారు,
విద్యార్థులను తమ పిల్లలుగా భావించి, నిత్యం విధ్యని అభ్యసించి, వారి యొక్క ప్రతిభను గుర్తించి జీవితంలో ఉన్నత స్థాయి కి ఎదిగేలా తీర్చిదిద్దాల్సిన విద్య సంస్థ, విధ్యార్థులుపై క్రిస్టియన్ మత పరమైన ఒత్తిడి తీసుకువస్తున్న స్ప్రింగ్ ఫీల్డ్ పాఠశాల యాజమాన్యం అయిన ఆలీవర్ రాయ్ మీద పాఠశాల మీద కఠిన చర్యలు తీసుకోవాలన్ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నగర శాఖ డిమాండ్ చేస్తూ జిల్లా విద్యా శాఖ అధికారినికి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని జిల్లా కన్వీనర్ ఉమ్మడి నితిన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎబివిపి రాష్ట్ర ఎస్ ఎఫ్ డీ కన్వీనర్ లొడగల అచ్చిబాబు, రాజేష్,సురేష్, యోగి తదితరులు పాల్గొన్నారు.

