చెత్తకుప్పలో శిశువు మృత దేహం పడేసిన మానవత్వం లేని మృగాలు.

చెత్తకుప్పలో శిశువు మృత దేహం పడేసిన మానవత్వం లేని మృగాలు.                           

మధురవాడ: పెన్ షాట్ ప్రతినిధి : జూలై 27: 


        మారికవలస పీపీ2 వాలనీ వద్ద చెత్తలో అప్పుడే పుట్టిన పసికందు మృతదేహంను  పడేశారు. జీవీఎంసీ 5వ వార్డ్ పరిధిలోని మారికవలస పిపి2 కాలనీ రహదారిలో శనివారం జరిగిన సంఘటన స్థానికులను ఆశ్చర్య చకితులను చేసింది. మారికవలస యు పి హెచ్ వైద్యలు డాక్టర్ చైతన్య తెలిపిన వివరాలు.  ఆరు నెలలు వయసు గల పసికందు ఆడపిల్ల ఫ్రీ డెలివరీ అయ్యి పసికందు మృతి చెంది ఉంటుందని అనంతరం శిశువు మృతదేహంను పడేసి చెత్తలో పడేసి ఉంటారని అన్నారు.  మా యుపిహెచ్ పరిధిలో ఈ ఘటన జరిగిందో లేక ఎక్కడ జరిగిందో ఆరా తీస్తామన్నారు. స్థానికులు 100కి కాల్ చేసి సమాచారం మేరకు పిఎం పాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.