మీసేవ ఆపరేటర్ల సమస్యలు పరిష్కరించాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ కి విజ్ఞప్తి చేసిన విశాఖ మీసేవ ఆపరేటర్లు.

మీసేవ ఆపరేటర్ల సమస్యలు పరిష్కరించాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ కి విజ్ఞప్తి చేసిన విశాఖ మీసేవ ఆపరేటర్లు.

విశాఖ : వి న్యూస్ : జూలై 28: 

ఆదివారం టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ రామటాకీస్ తన నివాసంలో రాష్ట్ర మీసేవ ఆపరేటర్ల సంక్షేమ సంఘం సూచనలతో, విశాఖ మీసేవ ఆపరేటర్ల సంక్షేమ సంఘం కార్యదర్శి నాగు సలహాలతో మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్రంలో మీసేవ ఆపరేటర్లు గత ఐదు ఏళ్లలో పడ్డ ఇబ్బందులు తెలియచేస్తూ కూటమి ప్రభుత్వం విజయాన్ని ఆకాంక్షిస్తూ విజయానికి తమ వంతు ప్రయత్నించి విజయంలో ఒక పాత్ర వహించిన మీసేవ ఆపరేటర్లు నూతన కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మీసేవ ఆపరేటర్లకు మీసేవ సర్వీసులు పునఃరుద్దరించి పూర్వ వైభవం తీసుకు వచ్చి మీసేవ ఆపరేటర్లను ఆడుకుంటారని ఆశించామని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యిన తరువాత సర్వర్లు ఇబ్బందులతో గత కొద్ది కాలంగా మీసేవ లాగిన్ ఇబ్బందులు వస్తున్నాయని కావున మీసేవ ఆపరేటర్లు సమస్యలను ఐటీ శాఖ మంత్రి, సచివాలయం శాఖ మంత్రుల దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కారం చూపాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ ని అభ్యర్థించారు. ఆయన మీసేవ ఆపరేటర్ల సమస్యలపై సానుకూలంగా స్పందించి తప్పకుండ సంబంధిత శాఖ మినిస్టర్ ల దృష్టికి తీసుకువెళ్లి నా వంతు సాహయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తులసిరామ్, చందు, హరికృష్ణ, శ్రీహరి, సత్యనారాయణ, సాయిరాం, గిరి తదితర మీసేవ ఆపరేటర్లు పాల్గొన్నారు.