మధురవాడ, వాంబేకాలనీలో ఆకస్మిక తనికీలు నిర్వహించిన జోన్2 మలేరియా ఇన్స్పెక్టర్ మంగరాజు.
October 03, 2024
మధురవాడ, వాంబేకాలనీలో జోన్2 మలేరియా ఇన్స్పెక్టర్ మంగరాజు ఆకస్మిక తనికీలు నిర్వహించారు. సిబ్బంది సరిగా ఇంటింటికి వెళ్లి మలేరియా, డెంగీ దోమల నివారణ కొరకు తీసుకోవలసిన నియమాలు, ఫ్రైడే డ్రైడే పై ప్రజలకు సూచిస్తున్నారా మరియు నీరు నిల్వ ఉండకుండా అన్ని మలేరియా సిబ్బంది తనికీలు చేస్తున్నారా అని ప్రజలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం మలేరియా సిబ్బంది రోజు వారి రికార్డులను తనికీ చేసారు. ప్రజలు మలేరియా సిబ్బంది మరియు సూపర్ వైసర్ క్రమం తప్పకుండ వచ్చి మాకు తగు సూచనలు చేస్తుంటారు అని తెలపటంతో ఇన్స్పెక్టర్ మంగరాజు సిబ్బంది పని తీరుపై సంతృప్తి వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమం 7వవార్డ్ సూపెర్వైసర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మలేరియా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
