సంపూర్ణ స్వచ్ఛత మరియు స్వచ్ఛత లాల్ శిత్ ఏకాయి కార్యక్రమం నిర్వహించిన జోన్2 కమీషనర్ సింహాచలం, 7వవార్డ్ కార్పొరేటర్ మరియు జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబెర్ పిళ్ళా మంగమ్మ.

సంపూర్ణ స్వచ్ఛత మరియు స్వచ్ఛత లాల్ శిత్ ఏకాయి కార్యక్రమం నిర్వహించిన జోన్2 కమీషనర్ సింహాచలం, 7వవార్డ్ కార్పొరేటర్ మరియు జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబెర్ పిళ్ళా మంగమ్మ.

మధురవాడ : వి న్యూస్ : అక్టోబర్ 01:

వాంబేకాలనీలో మంగళవారం  సంపూర్ణ స్వచ్ఛత మరియు స్వచ్ఛత లాల్ శిత్ ఏకాయి కార్యక్రమం జీవీఎంసీ 7వవార్డ్ సానిటరీ ఇన్స్పెక్టర్ సంతోష్ ఆధ్వర్యంలో జీవీఎంసీ సిబ్బంది నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిదులుగా జీవీఎంసీ జోన్2 కమీషనర్ సింహాచలం 7వవార్డ్ కార్పొరేటర్ మరియు జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబెర్ పిళ్ళా మంగమ్మ, టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యదర్శి పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా చీపుర్లు చేతబట్టుకుని స్వయంగా రహదారులను శుభ్రం చేసారు. అనంతరం వాంబే కాలనీలో ఉన్న అన్నాకాంటీన్ లో సిబ్బంది పని తీరు మరియు వంటలను పరిశీలించి ప్రజలకు వడ్డీంచారు. అనంతరం సచివాలయం సిబ్బంది తెల్లవారుజాము నుండి పెన్షన్లు  పంపిణీ పరిశీలించి కొందరు వృద్దులకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్లను అందచేశారు. ఈ సందర్బంగా కార్పొరేటర్, జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబెర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యిన వెంటనే పెన్షన్లను పెంచి ఒకటవ తారీకునే పెన్షన్ నూరుశాతం అందిస్తున్నామని ఒకటవ తేదీ సెలవు అయ్యితే ఒకరోజు ముందే పెన్షన్ అందచేస్తున్నామని తెలిపారు.

నూతన పెన్షన్లకు ఈ నెలలో దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు. అదేవిదంగా అన్నర్థులకు ఆకలి తీర్చే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ అన్నాకాంటీన్ల ద్వారా మూడు పూటలా కడుపు నిండా భోజనం అందచేస్తున్నారని అన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని ప్రజలకు అవగాహన కల్పించే విధంగా స్వయంగా పరిసరాలు పరిశుభ్రం చేసామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 7వవార్డ్ మహిళా అధ్యక్షురాలు నోడగల భవాని, బీజేపీ ఎస్సి మోర్చా జిల్లా నాయకులు ఎండా అప్పారావు. జనసేన నాయకులు రెడ్డి రాజు, మరియు జీవీఎంసీ సిబ్బంది, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.