ఘనంగా టిడిపి 5వ వార్డు అధ్యక్షుడు నాగోతి వెంకట సత్యనారాయణ జన్మదిన వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు.
మధురవాడ: : వి న్యూస్ : సెప్టెంబర్ 29:
యువ నాయకుడు,నమ్మకం నిజాయితీ కలగలిపిన వ్యక్తి, టిడిపి 5వ వార్డు అధ్యక్షుడు నాగోతి వెంకట సత్యనారాయణ(జపాన్)45వ జన్మదిన వేడుకలు.ఆదివారం జీవీఎంసీ 5వ వార్డు పరిధి మధురవాడ నగరంపాలెం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి, భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు...నాగోతి సత్యనారాయణ కు శుభాకాంక్షలు తెలిపి కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించి ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.ఈసందర్భంగా నాగోతి సత్యనారాయణ(జపాన్) ఆర్థిక సౌజన్యంతో 600 మందికి ఇన్సూరెన్స్,నగరంపాలెం ఎలిమెంటరీ పాఠశాలకు గ్యాస్ స్టవ్, కుర్చీలు,అంగన్వాడికి కుర్చీలు, కోలాటం బృందానికి చీరలు. భీమిలి నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు చేతులమీదుగా అందించారు.
అనంతరం జన్మదిన వేడుకల సంబరాలు అంబరాన్ని అంటాయి.ఈ సందర్భంగా నాగోతి సత్యనారాయణ(జపాన్) మాట్లాడుతూ అభిమానులు మధ్య జన్మదిన వేడుక జరుపుకోవడం నా అదృష్టమని,నన్ను అభిమానించి అభినందనలు తెలిపిన వారికి రుణపడి ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో 5,7 వార్డుల కార్పొరేటర్లు మొల్లి హేమలత, పిల్లామంగమ్మ,మధురవాడ కూటమి నేతలు మొల్లి లక్ష్మణరావు,వాండ్రాసి అప్పలరాజు,పిల్ల వెంకట్రావు, దాసరి శ్రీనివాస్,నమ్మి శ్రీనివాస్,నక్కా శ్రీధర్,బోయి శ్రీనివాస్,రమాదేవి,గరే గురునాథ్,ఈగల రవికుమార్ కానూరు అచ్యుతరావు, నాగోతి సూర్యప్రకాష్,నాగోతి నర్సినాయుడు,పసుపులేటి వాసు, రెడ్డి సత్యనారాయణ, లంకారాజేంద్రప్రసాద్,దితరులు పాల్గొన్నారు.

.jpeg)
