శుక్రవారం విశాఖ రూరల్ మండల స్థాయి "జగనన్నకు చెబుదాం" కార్యక్రమం

శుక్రవారం విశాఖ రూరల్ మండల స్థాయి "జగనన్నకు చెబుదాం" కార్యక్రమం

ఉన్నతాధికారులందరు తప్పక హాజరు కావాలి

జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లికార్జున.

పోతినమల్లయ్యపాలెం: వి న్యూస్ : సెప్టెంబర్ 21:

విశాఖపట్నం, సెప్టెంబర్ 21 : ప్రజా సమస్యల పరిష్కారానికి నిర్వహించే జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సెప్టెంబర్ 22 శుక్రవారం విశాఖ రూరల్ మండలంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లికార్జున ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుండి పోతినమల్లయ్యపాలెం అవంతి ఫంక్షన్ హాల్ ( జివిఎంసి ) నందు నిర్వహిస్తున్నట్లు తెలియజేసారు. ప్రతి సోమవారం జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం మండల స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాటు చేసిందని తెలిపారు. దీనిలో భాగంగా సెప్టెంబర్ 22 శుక్రవారం ఉదయం 10 గంటల నుండి విశాఖ రూరల్ మండలం, పోతినమల్లయ్యపాలెం అవంతి ఫంక్షన్ హాల్ ( జివిఎంసి ) నందు జగనన్నకు చెబుదాం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా HOD లు , జీవీఎంసీ అధికారులు , మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది తప్పకుండా హాజరు కావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని విశాఖ రూరల్ మండలంలోని ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని తమ సమస్యలు అధికారులకు తెలియజేసి , పరిష్కరించుకోవాలని కోరారు.