చంద్రంపాలెం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనికీ నిర్వహించిన సివిల్ జడ్జి, సీనియర్ డివిజన్ వెంకట శేషమ్మ

చంద్రంపాలెం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనికీ నిర్వహించిన సివిల్ జడ్జి, సీనియర్ డివిజన్  వెంకట శేషమ్మ      

మధురవాడ : న్యూస్ విజన్ : అక్టోబర్ 18: 

చంద్రంపాలెం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం సివిల్ జడ్జి, సీనియర్ డివిజన్  వెంకట శేషమ్మ ఆకస్మిక తనికీ నిర్వహించారు.   సెక్రటరీ, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అధారిటీ, విశాఖపట్నం వారు తనిఖీలలో భాగంగా  సివిల్ జడ్జి, సీనియర్ డివిజన్ వారు,  యం.శేషమ్మశుక్రవారం పాఠశాలను సందర్శించారు. వారి పరిశీలనలో విద్యార్థుల మధ్యాహ్న భోజనము పరిశీలించారు. విద్యార్థుల నుండి నాణ్యత, రుచి విషయమై అభిప్రాయాలు తీసుకున్నారు. మధ్యాన్న భోజన పధక రికార్డులను, స్టాకును పరిశీలించారు.తదుపరి విద్యార్థులతో సమావేశమై విద్యార్థులకు పలు విషయాలపై మార్గ నిర్ధేశం చేసారు. పోక్సో చట్టం గురించి వివరించి విద్యార్థులు తీసుకోవలసిన జాగ్రత్తలను తెలియజేసి చైతన్యపరిచారు.

బాల్యవివాహాల వల్ల అనర్థాలను తెలిపి, బాల్యవివాహాలు మంచిది కాదని తెలిపారు. మత్తుపదార్థాలు, గంజాయి సేవించడం వల్ల కలిగే అనర్థాలను తెలిపి, చట్టరీత్యా అది నేరమని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని తెలిపారు.సెల్ఫోన్ వినియోగం వల్ల కలిగే నష్టాలు విద్యార్థులకు వివరించి సెల్ఫోన్కు దూరంగా ఉండాలని తెలియజేసారు. ఉపాధ్యాయులు ప్రతీవారం విద్యార్థులలో అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజనం పై ఆమె సంతృప్తిని వ్యక్తం చేశారని ప్రధానోపాధ్యాయులు సోమయాజులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఊధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.