పలు మీడియా సంస్థలలో పని చేస్తున్న మధురవాడ ప్రాంత జర్నలిస్ట్లు, మధురవాడ వంతెన కింద సర్వీస్ రహదారి మరియు రేవల్లపాలెం జంక్షన్లో రహదారిలు అడుగుకు పైగా లోతు గుంతలు పడి రహదారి ఆధ్వహన్నంగా తయారయ్యింది. ఆ రహదారిలో ప్రయాణించే వాహనదారులు, పాదచారులు రోజు కొందరు ప్రమాదాలకు గురయ్యి గాయాల పాలవుతున్నారు. ముఖ్యంగా ఆ రహదారుల్లో ప్రమాదాలకు గురయ్యిన బాధితుల్లో మధురవాడ జర్నలిస్టులలో మేము కూడా ఒక బాధితులుగా మరియు ప్రజల ఇబ్బందులను గమనించి ఆ రహదారులను శాశ్వత పరిష్కారం కాకపోయినా తత్కాలిక మారమ్మాతులైన చెయ్యాలని మధురవాడ జర్నలిస్ట్ల తరపున అభ్యర్ధిస్తున్నాము అని జోన్2 కమీషనర్ సింహాచలంకు జోన్2 కార్యాలయంలో జరుగుతున్న గ్రీవెన్స్ లో వినతి పత్రం అందచేశారు.
