రహదారులు మరమ్మతులు చెయ్యాలని మధురవాడ జర్నలిస్ట్లు ఇచ్చిన వినతిపై స్పందించిన జోన్2 కమీషనర్ సింహాచలం

మధువాడలో పలు రహదారులు మరమ్మతులు చెయ్యాలని జర్నలిస్ట్లు ఇచ్చిన వినతి పై జోన్ 2 జోనల్ కమిషనర్ పి సింహాచలం స్పందించారు. మధురవాడలో పలు మీడియా ప్రతినిధులు ఇచ్చిన వినతిని జోన్2 కమిషనర్ సింహాచలం ప్రజల ఇబ్బందులను గుర్తించారు. సోమవారం జోన్2 కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్లో 

మధురవాడ బ్రిడ్జి క్రింద మరియు రేవళ్ల పాలెం రహదారులు ప్రమాదాలకు నిలయంగా మారాయని మధురవాడ ప్రాంత మీడియా మిత్రులు జోన్2 కమీషనర్ సింహాచలం కు వినతి పత్రాన్ని అందచేశారు. వెంటనే స్పందించి సంబంధిత శాఖ అధికారులకు జోన్2 కమిషనర్ పి సింహాచలం ఆదేశాలు జారీ చేసారు.

సోమవారం రాత్రికి రాత్రి ఆ ప్రదేశాల్లో తాత్కాలిక పరిష్కారం చేపట్టారు. ఈ సందర్బంగా జోన్2 కమీషనర్ పి సింహాచలం మాట్లాడుతూ రానున్న రోజుల్లో శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామి ఇచ్చారు. మధురవాడ జర్నలిస్ట్లు ఎప్పుడు వార్తలు రాయటమే కాదు ప్రజా సమస్యలపై అందరూ ఏకమై కలిసికట్టుగా వినతిపత్రం అందచేసి సమస్యను పరిష్కరించాలని ప్రజలకొరకు అభ్యర్ధించటం చాలా గొప్ప విషయం అని కొనియాడారు.