చంద్రంపాలెం బంగారమ్మతల్లికి మొక్కులు చెల్లించుకున్న భక్తులు.
మధురవాడ : వి న్యూస్ ప్రతినిధి : అక్టోబర్ 22:
చంద్రంపాలెం గ్రామ దేవతల్లో ఒకరైన బంగారమ్మ తల్లి కోరుకున్న కోరికలు తీర్చే కల్పవల్లికి మంగళవారం బక్కన్న పాలెం భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. బక్కన్నపాలెం వాస్తవ్యులు పోతిన ఎల్లారావు, అచ్యుతాలు దంపతుల కుమారుడు పోతిన రమేష్ బాబు, మెహర్ మౌనిక దంపతులకు కుమారుడు జన్మించిన శుభ సందర్భంగా చంద్రంపాలెం గ్రామ పెద్దలు పిళ్ళా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బంగారమ్మ అమ్మ వారికి మొక్కు తీర్చుకుని బంగారమ్మ తల్లి ఆలయం వద్ద అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రంపాలెం గ్రామ పెద్దలు మరియు ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
