తీవ్ర గాయాలతో పడి ఉన్న వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించిన పోలీసులు
మధురవాడ : వి న్యూస్ ప్రతినిధి : అక్టోబర్ 24:
పీఎంపాలెం పోలీసులు నిఘా వైఫల్యమా? లేకా అలసత్వమా?
బుధవారం రాత్రి సముద్రం రహదారి వద్ద మరిడిమాంబ దేవాలయం ఎదురుగా ఉన్న జోవల అపార్ట్మెంట్ కు వెళ్ళు దారిలో ఒక మగ వ్యక్తి రోడ్డు పక్కన గాయములతో పడి ఉండటం పోలీసులు గుర్తించారు. పోలీసులకు సమాచారం రాగా సముద్రం పెట్రోలింగ్ వాళ్ళు ఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు గాయాలయ్యి ఉన్న వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి కేజిహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పీఎంపాలెం పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది అని తెలిపారు.
పై ఘటనపై పీఎం పాలెం పోలీసు వారు కేసు నమోదు చేసి హత్య లేక ప్రమాదామా అనే కొనాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటన పై స్థానిక ప్రజలు భిన్నభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
మధురవాడ ప్రాంతంలో ఇంత దారుణం చోటు చేసుకున్న
మరోసారి పీఎంపాలెం పోలీసుల నిఘా వైఫల్యం కనిపిస్తోంది. ఐటీ సెజ్ జ్యువల్ పార్క్ సమీపంలో యువకుడు పై హత్యయత్నం జరిగినట్లు కనిపిస్తోంది. యువకుని తలపై గుర్తు తెలియని వ్యక్తులు బలంగా కొట్టి పడేసారు.
స్థానికుల సహాయంతో హాస్పిటల్ కి తరలించారు.
ఇంత వరకు నిందితుల ఆచూకి పీఎంపాలెం పోలీసులు తెలుసుకోలేక పోయారని అంటున్నారు. పీఎంపాలెం పోలీసులు మాత్రం ఈ ఘటనపై వివరాలు సేకరించే పనిలోనే ఉన్నామని అంటున్నారు.

