కల్లుగీత సహకార సంఘాల అధ్యక్షులతో చిట్టి బోయిన రాము ఆధ్వర్యంలో సమావేశం.

కల్లుగీత సహకార సంఘాల అధ్యక్షులతో చిట్టి బోయిన రాము ఆధ్వర్యంలో సమావేశం. 

 భీమిలి : వి న్యూస్ : సెప్టెంబర్ 22: 

భీమిలి నియోజకవర్గంలో భీమిలి నేరెళ్ల వలస కాలనీ కమ్యూనిటీ హాల్లో కల్లుగీత సహకార సంఘాల అధ్యక్షులతో చిట్టి బోయిన రాము ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య నాయకులు టిడిపి బీసీ సెల్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ మరియు యాత సంఘం రాష్ట్ర అధ్యక్షులు అంగటి రాము భీమిలి డివిజన్ నాయకులు రీసు రమణ గండి బోయిన రమణ కాకర ఎల్లారావు వేదికని అలంకరించినారు. ఈ సమావేశానికి కల్లుగీత సహకార సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అంగటి రాము మాట్లాడుతూ 
గత వైసిపి ప్రభుత్వం గీత కార్మికులకు ఎంతో అన్యాయం చేసిందని తెలుగుదేశం బిజెపి జనసేన కూటమి విజయం చెంది చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రభుత్వo ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన 100 రోజులకే కల్లుగీత కార్మికులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం గీత కార్మికులకు బ్రాందీ షాపుల్లో 10 శాతం షాపులను కేటాయించడం మన కార్మికులకు ఎంతో మేలు జరుగుతుందని ఆర్థికంగా మెరుగుపడతామని చెప్పడం జరిగింది అలాగే గీత కార్మికులకు పించిని 4000 రూపాయలు ప్రతి ఒకటో తారీఖున ఇంటికి వెళ్లి ఇవ్వడం ఎంతో ఆనందనీయమని చెప్పారు. అలాగే మన భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులుమాజీ మంత్రివర్యులు గంటా శ్రీనివాసరావు భీమిలి పరిసర ప్రాంతాల అభివృద్ధి కొరకు ఎంతో కృషి చేస్తున్నారని గీత కార్మికులకి కావలసిన సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. ఈ సమావేశం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడుకి ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కి బిజెపి రాష్ట్ర నాయకులకు అలాగే భీమిలి శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు గంటా శ్రీనివాసరావుకి తెలుగుదేశం పార్టీ భీమిలి ఇన్చార్జ్ కోరాడ రాజబాబు భీమిలి టీడీపీ నాయకులు చిక్కాల విజయబాబుకి జనసేన భీమిలి ఇన్చార్జ్ సందీప్ కి బిజెపి భీమిలి ఇన్చార్జ్ రాము నాయుడుకి ధన్యవాదములు తెలియజేస్తున్నాం అని అన్నారు.
ముఖ్యంగా ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తుంటే కొంతమంది తప్పుడు ప్రచారాలు చేయడం చాలా బాధాకరమని అన్నారు. మొన్న జరిగిన విజయవాడ వరదల సందర్భంగా రాత్రనకా పగలనకా వీధుల్లో తిరిగి ప్రతి ఒక్కరికి వారికి కావలసిన ఆహార పదార్థాలే కాకుండా చూడటంలో తక్షణ సౌకర్యాలు ప్రజలకు అందించడం అక్కడే ఉండి అధికారులందరితో పని చేయించడం ఒక్క చంద్రబాబునాయుడుకే దక్కుతుందని తెలియ చేసారు. మన యువ నాయకులు రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు లోకేష్ పాదయాత్రలో ఇచ్చిన హామీలో భాగంగా గీత కార్మికులందరినీ గుర్తించి 10 శాతం వైన్ షాపులు ఇస్తున్నందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తున్నాం ఇది మన ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతి గీత కార్మిక గ్రామాల్లో ప్రచారం చేస్తామని తెలియజేస్తున్నాం అని తీర్మానించారు.