వీధిలైట్లు,త్రాగునీరు,వీధి కాలువలు, రోడ్లునిర్మాణం,యు.జి.డి, సమస్యల పరిష్కారానికి సహకరించండి.
జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో తన వానిని వినిపించిన 5వ వార్డు కార్పొరేటర్ మొల్లి హే హేమలత.
బుధవారం జరిగిన జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్ మొల్లిహేమలత 5వ వార్డ్ అభివృద్ధికి సహకరించాలని సర్వసభ్య సమావేశంలో...జీవీఎంసీ మేయర్ గొలగాని హరివెంకట కుమారి కు తన వానిని వినిపించారు. ముఖ్యంగా జీవీఎంసీ జోన్-2 పరిధిలో మధురవాడ చెరువుల లో 5వ వార్డు కు చెందిన సర్వే నెంబర్ 61లోని బొట్టవానిపాలెం వెంపల చెరువు మరియు సర్వే నెంబర్ 65లోని నగరంపాలెం రాళ్ల చెరువులు ఒకప్పుడు ప్రజలకు మరియు పంట పొలాలకు స్వచ్ఛమైన నీరు అందించేవి.కానీ ఎన్నో ఏళ్లుగా పునరుద్ధరణకు నోచుకోకపోవడం వలన నీటి సామర్థ్యం తగ్గిపోయి కళావిహీనంగా మారాయి.చెరువులలో పూడికలు తీయించి ట్యాంక్ బండ్,వాకింగ్ ట్రాక్.. ఆధునీకరణ పనులు చేయించాలని,మరొకమారు మా అభ్యర్ధనను స్వీకరించి త్వరితగతిన పునరుద్ధరణ పనులు జరిగేలా తగుచర్యలు తీసుకోవాలని, కార్పొరేటర్ మొల్లిహేమలత కోరారు. వీధిలైట్లు,త్రాగునీరు,వీధి కాలువలు, రోడ్లునిర్మాణం,యు.జి.డి, సమస్యలు మరియు దీర్ఘకాలిక సమస్యలైనా రాజీవ్ గృహకల్ప, జే.ఎన్.ఎన్.యు.ఆర్.ఎం. కాలనీలలో దశాబ్దాలుగా ఉన్నటువంటి యూజీడి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని,రెండు దశాబ్దాల క్రితం ఏర్పడిన అయోధ్యనగర్ కాలనీకి మౌలిక వసతులు కల్పన,తుఫాన్ విపత్తుల నుండి రక్షణకు కొండవాలు ప్రాంతాల్లో రక్షణ గోడ,మెట్ల మార్గాలు నిర్మించమని తదితర అంశాలపై చర్చించారు.తదనంతరం జీవీఎంసీ కమిషనర్ పి.సంపత్ కుమార్ కు వార్డ్ సమస్యలపై వివరించి వినతపత్రం అందించారు. ఈసమస్యపై శాశ్వత పరిష్కారాన్ని చూపాలని కార్పొరేటర్ మొల్లి హేమలత కోరారు.
