సహాయక సంఘ సభ్యులు ఆధ్వర్యంలో మెప్మా అర్బన్ మార్కెట్ స్టాల్స్ ప్రారంభం

సహాయక సంఘ సభ్యులు ఆధ్వర్యంలో మెప్మా అర్బన్ మార్కెట్ స్టాల్స్ ప్రారంభం.
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు మరియు పురపాలకశాఖ మాత్యులు పి. నారాయణ మరియు మిషన్ డైరెక్టర్ మెప్మా వారి ఆదేశానుసారం పీడీ యూసీడీ జీవీఎంసీ వారి ఆదేశానుసారం జివిఎంసీ జోన్-2 5,6,7వ వార్డ్ పరిధిలో స్వయం సహాయక సంఘ సభ్యులు ద్వారా *మెప్మా అర్బన్ మార్కెట్ స్టాల్స్* నిర్వహించారు.ఈ కార్యక్రమము జోన్2- పరిధిలో గల స్యయం సహాయక సంఘాల సభ్యులు ద్వారా పలురకాల వ్యాపార స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమములో జోనల్ కమీషనర్ సింహాచలం పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహిళలు భారీగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మహిళలు మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల సభ్యులు తయారు చేసి వారే స్వయంగా అమ్ముకునే అవకాశం ప్రభుత్వం కల్పించి వారికి మంచి తోడ్పాటు నందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో 5వవార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత, టీడీపీ సీనియర్ నాయకులు పిళ్ళా వెంకటరావు, మొల్లి లక్ష్మణ్, 7వవార్డ్ జనసేన అధ్యక్షులు నాగోతి నరసింహ నాయుడు, బీజేపీ ఎస్సి మోర్చా నాయకులు ఎండా అప్పారావు తదితరులు పాల్గొన్నారు.