పాదచారుల రహదారి ధ్వంసం చేసిన వైస్సార్సీపీ నేతపై కార్పొరేటర్ పిర్యాదు పత్రాన్ని సీఐ బాలకృష్ణకు అందచేసిన టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యదర్శి పిళ్ళా వెంకటరావు.

పాదచారుల రహదారి ధ్వంసం చేసిన వైస్సార్సీపీ నేతపై కార్పొరేటర్ పిర్యాదు పత్రాన్ని సీఐ బాలకృష్ణకు అందచేసిన టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యదర్శి పిళ్ళా వెంకటరావు.

మధురవాడ : వి న్యూస్ : సెప్టెంబర్ 29:

పూర్వపు కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్ ప్రస్తుత వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకుడు ఆదివారం పాదచారుల రహదారి ధ్వంసం చేసారు. మితిలాపురి ఉడాకాలనీలో తన స్థలంలోకి కారు వెళ్ళటానికి మార్గం లేదని జీవీఎంసీ వారు నిర్మించిన పాదచారుల రహదారిని ధ్వంసం చేసి మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఘటనపై జోన్2 కమీషనర్ సింహాచలంకి మరియు పీఎంపాలెం సీఐ జి బాలకృష్ణ కు స్థానిక కార్పొరేటర్ పిళ్ళా మంగమ్మ చేసిన పిర్యాదును టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యదర్శి పిళ్ళా వెంకటరావు అందచేశారు.