వాంబేకాలనీ: వి న్యూస్ : సెప్టెంబర్ 22: 
రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి 100రోజులు పూర్తి చేసుకున్న సందర్బంగా నిర్వహిస్తున్న ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం కార్యక్రమంలో 7వవార్డు వాంబే కాలనీలో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాంబేకాలనీలో ఇంటి ఇంటికి కరపత్రాలు అందించి 100 రోజుల్లో నిర్వహించిన ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలు గురించి వివరిస్తూ రాబోయే కాలంలో చేసే పనుల గురించి ప్రజలకి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యదర్శి పిల్లా వెంకటరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 7వవార్డ్ సెక్రటరీ కానూరి అచ్యుతరావు. యువత అధ్యక్షులు మామిడి దుర్గారావు. నోడగల భవాని, మల్లువలస రాము, కోటేశ్వరరావు, రాగోలు లావణ్య, కిషోర్, సచివాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
