మట్టి గణపతిని పూజిద్దాం. పర్యావరణాన్ని రక్షిద్దాం. పీఎంపాలెం నూతన సీఐ జి బాలకృష్ణ, పోలీస్ కంట్రోల్ రూమ్ సి.ఐ వానపల్లి రామారావు పిలుపు.

మట్టి గణపతిని పూజిద్దాం. పర్యావరణాన్ని రక్షిద్దాం. పీఎంపాలెం నూతన సీఐ జి బాలకృష్ణ, పోలీస్ కంట్రోల్ రూమ్ సి.ఐ వానపల్లి రామారావు పిలుపు.

పీఎంపాలెం : వి న్యూస్ ప్రతినిధి : సెప్టెంబర్ 05:

మట్టి గణపతి ప్రతిమలను వినియోగించుట వలన పర్యావరణానికి మేలు జరుగుతుందని పి.ఎం.పాలెం సి.ఐ గేదెల బాలకృష్ణ అన్నారు. రాబోయే వినాయక చవితి సందర్భంగా *సుపధ" దినపత్రిక పాత్రికేయుడు రమణ తోడ్పాటుతో అల్లుడు రవికుమార్, కుమార్తె పూజదేవి  ఆధ్వర్యంలో గురువారం మధురవాడ శిల్పారామంలో మధురవాడ మీడియా మిత్రులకు మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పి.ఎం.పాలెం పోలీస్ స్టేషన్ సి.ఐ గా బాధ్యతలు స్వీకరించిన గేదెల బాలకృష్ణ, పోలీస్ కంట్రోల్ రూమ్ సి.ఐ వానపల్లి రామారావు హాజరయ్యి మధురవాడ పాత్రికేయులకు మట్టి వినాయక ప్రతిమలను అందజేశారు.

అనంతరం సి.ఐ బాలకృష్ణ మాట్లాడుతూ పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా ఉండేలా ప్రతీ ఒక్కరూ మట్టి గణపతి ప్రతిమలనే పూజించాలని అన్నారు.  ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రంగులతో తయారు చేసిన ప్రతిమలను వాడటం వల్ల పర్యావరణానికి నష్టం వాటిల్లుతుందని, జీవరాసులకు ప్రాణహాని కలుగుతుందన్నారు. ముందుతరాల వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కాలుష్యరహితంగా ఉండేలా మన పండుగలను జరుపుకోవాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మధురవాడ పాత్రికేయులు పాల్గొన్నారు.