భారతదేశం అంటే గుర్తుకువచ్చేది చీరకట్టు, సాంప్రదాయంచేనేత కార్మికులను ఆదుకుంటాం-హోం మంత్రి వంగలపూడి అనిత

భారతదేశం అంటే గుర్తుకు వచ్చేది చీరకట్టు, సాంప్రదాయమని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. ది స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ ఆద్వర్యంలో బీచ్ రోడ్డులో హ్యాండ్లూమ్ సారీ వాక్ ను హోం మంత్రి ప్రారంభించి, వాక్ లో పాల్గొన్నారు.వేలాదిమంది మహిళలు సారీవాక్ లో పాల్గొని సందడి చేశారు. చీరకట్టడం అనాదిగా వస్తున్స సంప్రదాయమని,చీరలో అమ్మతనం,కమ్మతనం ఉంటుందని హోంమంత్రి అనిత అన్నారు. చీర అంటే గుర్తుకు వచ్చేది అమ్మ అని, భావితరాలు ఈ సాంప్రదాయాన్ని కొనసాగీంచాలన్నారు.
చేనేత కార్మికులు ఇప్పటికి చాలా ఇబ్బందులు పడుతున్నారని, చేనేత కార్మికులను ఆదుకుంటామన్నారు. నిర్వాహకులకు మంత్రి అనిత ప్రత్యేక అభినందనలు తెలిపి,మహిళలకు జ్ఞాపికలు అందజేసారు. ది స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ సభ్యులు దొరబాబు,డాక్టర్ పద్మ శ్రీ,వినయ్,శేఖర్,లలిత శ్రీనువాస్ హోం మంత్రి వంగలపూడి అనితని ఘనంగా సత్కరించారు.