అనకాపల్లి నాలుగు రోడ్లు జంక్షన్ సిపిఐ కార్యాలయంలో ఉమ్మడి విశాఖ జిల్లా మీసేవ ఆపరేటర్ల సంక్షేమ సంఘం పాత కార్యవర్గం అధ్యక్షులు అప్పలనాయుడు, కార్యదర్శి నాగు ఆధ్వర్యంలో నూతన కార్యవర్గం ఎంపిక కార్యక్రమం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉమ్మడి విశాఖ జిల్లా ఏపీ ఆన్లైన్, సి ఎమ్ ఎస్, రామిన్ఫో సంస్థల నుండి ఆపరేటర్లు పాల్గొన్నారు. ముందుగా నూతన కార్యవర్గంలో అధ్యక్షులుగా కోరుపోలు చంద్రశేఖర్( సిఎమ్ఎస్ )ని కార్యదర్శి నాగు ప్రతిపాదించగా సభ్యులు అందరు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం అధ్యక్షులు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గౌరవ అధ్యక్షులుగా అప్పలనాయుడు (సిఎమ్ఎస్ )ఉపాధ్యక్షులు నాగరాజు (ఏపీ ఆన్లైన్ )తులసి రామ్ (రామిన్ఫో ) సెక్రటరీ నాగు (ఏపీ ఆన్లైన్ )జాయింట్ సెక్రటరీ డి వి ఎన్ శ్రీనివాస్ (ఏపీ ఆన్లైన్ )సి హెచ్ వి రామారావు (సి ఎమ్ ఎస్ ) మోహన్ (రామ్ఇన్ఫో ) ఆర్గనైజింగ్ సెక్రటరీ సిరిపురపు శ్రీహరి (ఏపీ ఆన్లైన్ ) ట్రీజరర్ భీమేష్ (ఏపీ ఆన్లైన్ )ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ విజయ్ చౌదరి (రామ్ ఇన్ఫో ) టీ వి ఆర్ కే రాజు (ఏపీ ఆన్లైన్ )జోగారావు (సి ఎమ్ ఎస్ )గా ఎంపిక చేసారు. అనంతరం మీసేవ ఆపరేటర్ల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియచేస్తూ మీసేవ ఆపరేటర్ల సమస్యల పరిష్కారానికై కృషి చేసి మీసేవ వ్యవస్థకు పూర్వ వైభవం వచ్చే విధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు తమ వంతు సహాయ సహకారాలు అందించి మీసేవ వ్యవస్థ అభివృద్ధి కి తోడ్పాటు అందించాలని సూచించారు. నూతన కార్యవర్గం సభ్యులు మాట్లాడుతూ త్వరలో కార్యవర్గ నిర్వహణ పనులు అందరి అభిప్రాయాలు సేకరించి సలహాలు సూచనలు తో ప్రణాళిక కార్యవర్గం విధి విధానాలు ప్రతి ఒక్కరికి మండల కమిటీ సభ్యులు ద్వారా తెలియ చేసి మీసేవ ఆపరేటర్ల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామని తెలియ చేసారు.
