పాంగి రాంబాబు( మరణించిన వ్యక్తి) కొత్త పాడేరు నుండి తన కిరాయి కోసం రెండు క్యాన్ల జీరుకలు అమ్మకానికి మైదాన ప్రాంతానికి ద్విచక్ర వాహనంలో(AP31 CV 1755) తీసుకు వెళ్తుండగా, వంట్లమామిడి గ్రామం మార్గం మధ్యలో పాలు వ్యాను కూడా ఆ ద్విచక్ర వాహనం వెనకే వెళ్తుంది...అయితే పాలు వ్యాన్ (AP16TF5227) ఆ ద్విచక్ర
వాహనాన్ని ఓవర్ టెక్ చేస్తున్న సమయంలో కార్నర్ రావడంతో మైదాన ప్రాంతం నుండి పాడేరు వెళ్తున్న ఒక వాహనం చూసి పాలు వ్యాన్ డ్రైవర్ అయినా బి కొండబాబు (మాడుగుల గ్రామానికి చెందిన వ్యక్తి) ఆ ద్విచక్ర వాహనాన్ని గట్టిగా వెనక నుండి ఇక ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనం లో ఉన్న పాంగి రాంబాబు అక్కడికక్కడే మరణించాడు. సంఘటన చూసి వంట్లమామిడి గ్రామస్తులందరూ అక్కడికి వెళ్ళగా అప్పటికే పాంగి రాంబాబు మరణించారు. వెంటనే పాడేరు స్టేషన్ ఎస్ఐ లక్ష్మణ్ ను సంఘటన వివరాలు తెలపగా ఆయన సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి గ్రామస్తుల నుండి వివరాలు తెలుసుకున్నారు. వెంటనే చనిపోయిన ఆ వ్యక్తిని అంబులెన్స్ లో ఎక్కించి పాడేరు డిస్ట్రిక్ట్ ఆసుపత్రికి తరలించారు. ఢీ కొట్టిన పాలు వ్యాన్ ని కూడా రికవర్ చేసుకొని పాడేరు పోలీస్ స్టేషన్ కు తరలించారు.
