గోపాలపట్నం తహసీల్దార్ గా భాద్యతలు తీసుకున్న సిహెచ్ వి రమేష్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విశాఖజిల్లా మీసేవ ఆపరేటర్లు.

గురువారం గోపాలపట్నం తహసీల్దార్ గా భాద్యతలు తీసుకున్న సిహెచ్ వి రమేష్ ని విశాఖజిల్లా మీసేవ ఆపరేటర్లు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుత్చ్మ్ అందచేసి గౌరవించారు. అనంతరం మీసేవ ఆపరేటర్లకు రెవెన్యూ సర్వీసులు ద్వారా ఎదురవుతున్న ఇబ్బందులను తహసీల్దార్ రమేష్ కి వివరించారు. విద్యార్థులకు పాఠశాలలకు, కళాశాలకు కౌన్సెలింగ్ సమయంలో నిర్నీత సమయంలో అందచేయక పోవటంతో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలుపుతూ తమరు వీలైనంత త్వరగా కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ప్రజలకు అందచేసే విధంగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా ఏపీ ఆన్లైన్ ఫ్రాంచేజీ మేనేజర్ రాజేష్ విశాఖ జిల్లా మీసేవ ఆపరేటర్ల సంక్షేమ సంఘం కార్యదర్శి నాగు, శ్రీనివాస్, వెంకటరావు, తదితర మీసేవ ఆపరేటర్లు పాల్గొన్నారు.