వంతెన లేక తాటితురు గ్రామ ప్రజల అవస్థలు.

వంతెన లేక తాటితురు గ్రామ ప్రజల అవస్థలు.

భీమిలి :వి న్యూస్: ఆగష్టు01:


 
గోస్తని నదిలో నుంచి పాఠశాలకు వెళ్లడానికి అవస్థలు పడుతున్న విద్యార్థులు.

మాకు ఒక వంతెన ఏర్పాటు చేయండి మహాప్రభో

అభివృద్ధి చెందిన జిల్లాలలో విశాఖ జిల్లా పేరు ముందు వరుసలో ఉంటుంది. టూరిజం కు పేరెన్నిక గల జిల్లా,దేశంలో రెండవ మున్సిపాలిటీగా పేరొంది, సముద్ర ప్రాంతంతో హొయలొలికే ప్రాంతంలో ఇప్పటికి సరైన రోడ్డు, బ్రిడ్జి సదుపాయాలు లేక అవస్థలు పడుతున్న ప్రాంతంగా కూడా గుర్తింపు పొందింది భీమిలి నియోజకవర్గం.భీమిలి నియోజకవర్గం పరిధిలోని తాటితూరు పంచాయతీలో ఉన్న ప్రజలు గత 20 సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య... ఊరు మధ్యలో నుంచి ప్రవహిస్తున్న గోస్తనీ నది మీదగా ఒక  వంతెన ఏర్పాటు చేయాలని గ్రామ ప్రజలు వేడుకుంటున్నారు. ఊరి మధ్యలో నుంచి ప్రవహిస్తున్న గోస్తని నది ప్రవాహం వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు . అలాగే చుట్టుపక్కల ఉన్న విద్యార్థులు పాఠశాలలకు రాడానికి గోస్తని నది నీటిలో నుంచి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. వర్షాకాలంలో విద్యార్థులు అలాగే రైతులు కూడా నదిలో నుంచి రాకపోకలు సాగించే సమయంలో ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వస్తుంది. ముఖ్యంగా మరణించిన వారికి దహన సంస్కారాలు చేయడానికి కూడా ఈ గోస్తని నది దాటే వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. భీమిలి నియోజకవర్గం, తాటితూరు పంచాయితీలో బ్రిడ్జి లేక స్థానికులు పడుతున్న పాట్లు పట్టించుకోని ఎమ్మెల్యే అవంతి, వైఎస్సార్సీపీ ప్రభుత్వం పై గతంలో గ్రామ యువత సమక్షంలో ఎప్పటినుంచో నిర్మాణానికి నోచుకోని తాటితూరు కాజ్వే బ్రిడ్జి స్థలంను డా. సందీప్ పంచకర్ల పరిశీలించి, 30 రోజుల్లో బ్రిడ్జి నిర్మాణం ప్రారంభించని పక్షంలో నిరాహార దీక్ష చేపడతాం అని ఎమ్మెల్యే అవంతికి అల్టిమేటం జారీ చేసిన తరువాత  గత వైసిపి ప్రభుత్వంలో సుమారు రెండు కోట్ల రూపాయలతో వంతెన నిర్మిస్తామని, తమ గ్రామాన్ని అభివృద్ధి కూడా చేస్తామని చెప్పి శిలాఫలకాన్ని ఏర్పాటు చేసి కొబ్బరికాయలు కొట్టి వెళ్లిపోయారు. మరల ఇంతవరకు కనీసం ఓ ఇటుక కూడా వేయలేదు. ఇప్పుడు కుటమీ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ..నది మధ్యలో నుంచి ఒక బ్రిడ్జి ఏర్పాటు చేసి రైతులకు విద్యార్థులకు ప్రాణాపాయం నుంచి తప్పించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ని ,ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని, మంత్రి లోకేష్ ని, భీమిలి కూటమి ప్రభుత్వ శాసనసభ్యులైనా గంటా శ్రీనివాసరావుని గ్రామస్తులు వేడుకుంటున్నారు.