రేవల్లపాలెం రహదారిలో ట్రాఫిక్ నివారణపై స్పందించిన పీఎంపాలెం ట్రాఫిక్ పోలీసులు

పీఎంపాలెం : విశాఖ లోకల్ న్యూస్ ప్రతినిధి : ఆగష్టు 20
రేవల్ల పాలెం రహదారిలో ఒక ప్రైవేట్ పాఠశాల వద్ద నిర్లక్ష్యంగా వాహనాలు నిలిపేసి పాదచారులకు, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని పిర్యాదులు రావటంతో రంగంలోకి దిగిన పీఎంపాలెం ట్రాఫిక్ సిబ్బంది. సురక్షితంగా పాఠశాల విద్యార్థులకు రోడ్లను ట్రాఫిక్ సిబ్బంది దాటించారు. రోడ్లపై విచ్చలవిడిగా పార్కింగ్ చేస్తున్న వాహనాలను పీఎంపాలెం ట్రాఫిక్ పోలీసులు తరలించారు. అనంతరం ఆటో డ్రైవర్లకు కౌన్సెలింగ్ ఇచ్చి ట్రాఫిక్ అంతరాయం కలిగేవిధంగా వాహనాలను నిలపవద్దని సూచించారు. ట్రాఫిక్ అంతరాయం కలిగే విధంగా నిలిపిన వాహనాలపై చర్యలు తీసుకుంటామని హేచ్చరించారు.