వైద్య విద్యార్థిని హత్యాచార ఘటనలో నిందుతుడుని కఠినంగా శిక్షించాలి

వైద్య విద్యార్థిని హత్యాచార ఘటనలో నిందుతుడుని కఠినంగా శిక్షించాలి : విజిలెన్స్ కమిటీ జాతీయ కార్యదర్శి భాగం స్వాతి సుధాకర్.

పీఎంపాలెం : వి న్యూస్ ప్రతినిధి : ఆగష్టు 22: 

అంతర్జాతీయ మానవ హక్కుల న్యాయ సేవా మండలి ఆధ్వర్యంలో కలకత్తా లో వైద్య విద్యార్థి హత్యాచార ఘటనలో నిందుతుడిని కటినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ జాతీయ ఆర్గనైజింగ్ చైర్మన్ ఓరగంటి ‌సుబ్బారావు పిలుపుతో విజిలెన్స్ కమిటీ జాతీయ కార్యదర్శి భాగం స్వాతి సుధాకర్ మరియు ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కె.రాజ్ కుమార్ సంయుక్త ఆద్వర్యంలో బారీ ర్యాలీ నిర్వహించి నిరసన తెలపడం జరిగింది .

నిరసనలో బాగంగా భాగం స్వాతి సుధాకర్ మాట్లాడుతూ విది నిర్వాహణ లో ఉన్న యువ వైద్య వైద్యరాలిపై జరిగిన అత్యాచారం జరిగిన తీరు,రోజు రోజుకీ ఇలాంటి సంఘటనలపై వస్తున్న విషయాలు దృష్ట్యా ఈ ఉదంతం ఏదైతే ఉందో దేశమంతటిని కదిలించింది అని,ఇలాంటివి మరల పునరావృతం కాకుండా న్యాయ వ్యవస్థలో మరిన్ని కఠినతరమైన సెక్షన్లు తీసుకువచ్చి త్వరితగతిన శిక్ష అమలు పరిచే విధంగా నూతన సవరణ మార్పులు తీసుకు రావాలని, తల్లితండ్రులు తమ పిల్లలకు చిన్ననాటి నుంచే సమాజం పట్ల స్త్రీలు విషయంలో విలువలతో కూడిన మంచిని బోధించాలని,రాతిలో ఆడ దేవతని పూజించే సంస్కృతి గల మన దేశంలో అదే ఆడవారిని  సెక్స్ కు పనికి వచ్చే వస్తువుగా పరిగణించడం చాలా అమానుషం, స్త్రీ మానవ సమాజ మనగడుకు మూల ఆదారం ఇది మరిస్తే ఈ లోకం శూన్యం అవుతుంది ఇది ప్రతీ ఒక్కరు గ్రహించి స్త్రీల పట్ల సహృదయంతో మెలగాలని,పశ్చిమ బెంగాల్ మహిళా ముఖ్యమంత్రి గా మమతా బెనర్జీ ఉన్నారు అమ్మా మీరు కూడా ఒక మహిళే మీకు ఒకటే విన్నపం అత్యంత హేయమైన ఈ ఘటనపై నిందుతుడు కి ఉరిశిక్ష లాంటి కఠినమైన శిక్ష ను త్వరగా పడేలా చూడాలని డిమాండ్ చేస్తూ మాట్లాడారు 

అనంతరం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కే.రాజ్ కుమార్ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తా ఆర్జి కెర్ హాస్పిటల్ లొ మౌమిత అనే వైద్యరాలి పై జరిగిన హత్యాచార ఘటన పట్ల విచారం వ్యక్తం చేస్తున్నానని,కఠినమైన సెక్షన్ లు అమలు చేస్తున్న ఇలాంటి ఘటనలు రోజు రోజుకి పెరగడం చాలా దురదృష్టకరమైన విషయం అని,దోషులు ఎంతటి వారైనా కటినంగా శిక్షించాలని.ఇలాంటి ఘటనలు మరలా పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని,ఈ విషయంలో అంతర్జాతీయ మానవ హక్కుల న్యాయ సేవా మండలి ముందుంటుందని మాట్లాడారు 

ఈ నిరసన కార్యక్రమం లో విజిలెన్స్ కమిటి జాతీయ కార్యదర్శి భాగం స్వాతి సుధాకర్ - ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కె.రాజ్ కుమార్ - రాష్ట్ర కార్యదర్శి కే.వెంకట రమణ - మానవ హక్కుల ఎక్టివిస్ట్ చిల్ల ప్రకాష్ రెడ్డి (తాటితూరు) పాల్గొన్నారు