అయ్యబాబోయ్ పందులు, అనారోగ్యాల బారిన పడుతున్న వాంబేకాలనీ నివాసితులు

మధురవాడ : విశాఖ లోకల్ న్యూస్ ప్రతినిధి : ఆగష్టు 20: 
మధురవాడ వాంబేకాలనీలో విపరీతంగా పందులు వందల సంఖ్యలో తిరుగుతున్నాయి. అవి జనావాశాల మధ్యలో తిరుగుతూ ఉండటంతో నివాసితులు తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నారు అంటూ ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. గతంలో గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు కఠిన నివారణ చర్యలు చేపట్టడంతో పందులు పూర్తిగా నివారించగలిగారని అన్నారు. మళ్లీ పందులు ప్రజల కన్న ఎక్కువ సంఖ్యలో పందులు దర్శనమిస్తున్నాయని అన్నారు. జీవీఎంసీ సిబ్బంది ఎంత కష్టపడి పరిసరాలను శుభ్రం చేసిన నిముషాలు వ్యవధిలో పందులు పరిసరాలను పాడు చేస్తున్నాయని అంటున్నారు. పందుల నివారణపై ఉన్నతాధికారులు ద్రుష్టి సారించి ప్రజల ఆరోగ్యం కొరకు పందులను నివారించాలని నివాసితులు కోరుతున్నారు.