మలేరియా, డెంగీ దోమల నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించిన 7వ వార్డ్ మలేరియా సిబ్బంది
August 20, 2024
మధురవాడ : విశాఖ లోకల్ న్యూస్ ప్రతినిధి : ఆగష్టు 20: మధురవాడలో శ్రీ విష్ణు పాఠశాల విద్యార్థులతో మలేరియా, డెంగీ దోమల నివారనపై ప్రజలకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆదేశాలతో, 7వవార్డ్ కార్పొరేటర్, స్టాండింగ్ కమిటీ మెంబెర్ పిళ్ళా మంగమ్మ వార్డులో ప్రజలు మలేరియా, డెంగీ బారిన పడకుండా ఉండేవిధంగా దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరటంతో జోన్2 మలేరియా ఇన్స్పెక్టర్ మంగరాజు 7వ వార్డ్ మలేరియా, డెంగీ నివారణ సిబ్బందికి ఆదేశాలు జారీ చెయ్యటంతో 7వవార్డ్ సూపెర్వైసర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో మంగళవారం శ్రీ విష్ణు పాఠశాల విద్యార్థులతో మధురవాడ రహదారిలో మలేరియా డెంగీ దోమల నివారణపై వేపాకుల పొగ, దోమలకు సెగ, నీరు నిల్వ లేకుండా, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచటంతోనే దోమలను నివారించవచ్చని తద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. సూపెర్వైసర్ సత్యనారాయణ మాట్లాడుతూ ఇంట్లో నిరూపయోగంగా ఉన్న, ఉపయోగంలో ఉన్న బాటిల్, టైర్లు, మొక్కల కుండీలలో ఫ్రిడ్జ్ వెనుక, కొన్ని వస్తువులలో నీరు నిల్వ ఉండటంతో లార్వా తయారయ్యి మలేరియా, డెంగీ దోమలు వృద్ధి చెందుతాయని కావున ప్రజలు వీటిని గుర్తించి నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, అలాగే ప్రతీ శుక్రవారం ట్యాంకులు, డ్రమ్ములను శుభ్రపరిచి డ్రై డే ఫ్రైడే గా చూసుకోవాలని తగు సూచనలు చేసారు.ఈ కార్యక్రమంలో లక్ష్మి, భవాని, దుర్గ, సంతోషి, బాలకృష్ణ తదితర సిబ్బంది పాల్గొన్నారు.
