78వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు పొందిన వేపగుంట సెక్షన్ విద్యుత్ సిబ్బంది

78వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు  పొందిన వేపగుంట సెక్షన్ విద్యుత్ సిబ్బంది.
పెందుర్తి విద్యుత్ డివిజన్ కార్యాలయం వద్ద 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు గురువారం నాడు ఘనంగా నిర్వహించారు. ఏ డి ఈ  యస్.అప్పన బాబు  జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎందరో మహానుభావుల ప్రాణత్యాగఫలమే ఈ స్వాతంత్ర దినోత్సవం అన్నారు. పెందుర్తి సబ్ డివిజన్ లో వేపగుంట సెక్షన్ కార్యాలయంలో లైన్ ఇన్ఫెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న కె శ్రీనివాసరావు, లైన్ మాన్ గా విధులు నిర్వహిస్తున్న పి. గణేష్, పీక్ లోడ్ లో విధులు నిర్వహిస్తున్న యన్. శ్రీను. ఉత్తమ ఉద్యోగి అవార్డ్ సాధించారు.వీరు ఎడిఈ యస్. అప్పన బాబు చేతుల మీదగా మెమెంటో అందుకున్నారు. ఉత్తమ ఉద్యోగిగా మెమెంటో అందుకున్న వీరికి తోటి సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.